" నేరేడు పండ్లు ఎక్కువగా కాస్తే ఆ ఏడాది కరువు వస్తుంది" అని తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఒక పాత నానుడి ఉంది. అంటే నేరేడు పళ్లు అతిగా కాయడం అనావృష్టికి సంకేతం అని పెద్దలు చెబుతుంటారు.
అయితే ఈ ఏడాది కూడా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో నేరేడు చెట్లు విపరీతంగా పండ్లు కాశాయి. దీంతో ఇప్పుడు కరువుకు సంబంధించిన చర్చ మొదలైంది. దీనికి తోడు ఈసారి ఎల్‌నినో ఎఫెక్ట్ ఉంటుందని.. వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉంటాయని.. భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు చేయడంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినా అవి చాలా నెమ్మదిగా విస్తరిస్తుండటంతో.. అడపాదడపా వర్షాలు అక్కడక్కడా కురుస్తున్నాయి కానీ.. భారీ వర్షాల ఊసే లేదు. దీంతో ఈసారి కరువు తప్పదనే భయాలు నెలకొన్నాయి. ఇక వ్యవసాయం ఎలా అని.. అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఆకాశం వైపు చూస్తున్నారు. కరువు వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏళ్ల తరబడి పరిశీలనతరతరాలుగా రైతులు, ప్రకృతి ప్రేమికులు గమనిస్తూ వస్తున్న విషయం ఏంటంటే.. గత కొన్ని సంవత్సరాలుగా నేరేడు చెట్లు సాధారణం కంటే ఎక్కువ పుష్పించి, విపరీతంగా పండ్లు కాస్తే.. ఆ ఏడాది వర్షాలు తక్కువగా పడటం లేదా కరువు పరిస్థితులు ఏర్పడటాన్ని వారు గుర్తించారు. ఈ పరిశీలన ఆధారంగానే "నేరేడు కాయలు ఎక్కువైతే కరువు" అనే దృఢమైన నమ్మకం వారిలో ఏర్పడింది.నిపుణులు ఏం చెబుతున్నారు?ఇక.. వృక్ష శాస్త్ర నిపుణుల ప్రకారం దీన్ని స్ట్రెస్ ఫ్లవరింగ్ లేదా స్ట్రెస్ ఫ్రూటింగ్ అంటారు. అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత, భూగర్భ జలాలు తగ్గిపోవడం వంటి ఒత్తిడి పరిస్థితులను చెట్లు ఎదుర్కొన్నప్పుడు.. అవి తమ జాతి మనుగడను కాపాడుకోవడం కోసం ఎక్కువ పూలను, అధికంగా పండ్లను కాయడానికి ప్రయత్నం చేస్తాయని.. ఇది ప్రకృతిలో ఒక రక్షణాత్మక జీవ ప్రక్రియ అని పేర్కొంటున్నారు. వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. నేరేడు చెట్లు విరగకాయం అనేది కరువును సృష్టించవని.. కరువుకు దారితీసే వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడే ఆ చెట్లు ఎక్కువ పండ్లను ఇస్తాయంటున్నారు. నేరేడు చెట్టుకు ఏ వాతావరణం అనుకూలం?నేరేడు చెట్లు పుష్పించం, పండ్లు కాయడానికి పొడి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక నేరేడు పండ్లు పక్వానికి వచ్చే దశలో తొలి వర్షాలు పడితే పండ్ల పరిమాణం, రంగు, రుచి మరింత బాగుంటాయి.ఈ ఏడాది కరువు ఖాయమేనా?కేవలం నేరేడు పండ్లు అధికంగా కాయడం ఆధారంగా ఈ ఏడాది కరువు వస్తుందని చెప్పడం శాస్త్రీయంగా సరైంది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాలు కురవకపోవడానికి, నేరేడు పండ్ల అధిక కాతకు సంబంధం లేదని చెబుతున్నారు. వర్షపాతం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఎల్‌నినో లేదా లానినా వంటి పరిస్థితులు, బంగాళాఖాతం, అరేబియా సముద్ర వాతావరణ వ్యవస్థలు వంటి అనేక అంశాల ఆధారంగా మాత్రమే కరువు సంభవిస్తుందా లేదా సాధారణ వర్షపాతం ఉంటుందా అనేది మాత్రమే అంచనా వేయగలమని.. వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నెట్టింట చర్చఅయితే నేరేడు పండ్లు, కరువుకు సంబంధించి.. సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి చేసిన సుదీర్ఘ పోస్ట్‌తో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి ఓ పోస్ట్ పెడుతూ.. తాను చెప్పే సిద్ధాంతానికి పూర్తిగా శాస్త్రీయత ఉందో లేదో తెలియదని.. ఇది ఆసక్తికరమైన సమాచారం అనిపించి షేర్ చేస్తున్నానని పేర్కొ్న్నారు. ఈ ఏడాది మార్కెట్లలో గత కొన్నేళ్ల కంటే ఎక్కువగా నేరేడు పండ్లు కనిపిస్తున్నాయని.. చెట్ల నుంచి కూడా విపరీతంగా రాలుతున్నాయని తెలిపారు.ఇక తమ అమ్మమ్మ ఒక మాట చెప్పేదని.. "వేసవిలో నేరేడు చెట్లు ఇంతగా పండ్లు రాలిస్తే, ఆ సంవత్సరం కరువు వచ్చే అవకాశం ఉంటుంది" అని గుర్తు చేసుకున్నారు. వృక్ష శాస్త్రం ప్రకారం దీన్ని మాస్టింగ్ (Masting) లేదా స్ట్రెస్ ఫ్రూటింగ్ (Stress Fruiting) అంటారని.. కొన్ని సందర్భాల్లో సూసైడ్ ఫ్రూటింగ్ (Suicide Fruiting) లేదా బంపర్ క్రాప్ (Bumper Crop) అని కూడా పిలుస్తారని వెల్లడించారు.భూగర్భ జలాలు తగ్గుతున్నాయని లేదా వాతావరణంలో పెద్ద మార్పులు రాబోతున్నాయని చెట్టు గుర్తిస్తే.. తమ శక్తిని అంతా ధారపోసి.. కొత్త కొమ్మలు, ఆకుల పెరుగుదలపై కాకుండా పండ్లు, విత్తనాల ఉత్పత్తిపై కేంద్రీకరిస్తుందని ఆ నెటిజన్ తెలిపారు. నేరేడు చెట్లకు లోతుగా వెళ్లే (ట్యాప్రూట్ సిస్టమ్) (Taproot System) ఉంటుందని.. భూగర్భ జలమట్టం బాగా పడిపోయినప్పుడు ఈ వేర్లు వాటర్ స్ట్రెస్ (Water Stress)ను అనుభవిస్తాయని తెలిపారు. ఇది రాబోయే కరువు లేదా తీవ్రమైన వేసవికి సంకేతంగా పనిచేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తారని గుర్తు చేశారు.అందుకే వేసవిలో నేరేడు చెట్లు అసాధారణంగా ఎక్కువ పండ్లు కాస్తే, అది ప్రకృతి నుంచి వచ్చే ఒక హెచ్చరిక కావచ్చని చెబుతారని తెలిపారు. ఇది చెట్టు ఆత్మహత్య చేసుకోవడం కాదని.. తన జాతిని కొనసాగేందుకు తదుపరి తరానికి ఎక్కువ విత్తనాలు అందించే ప్రయత్నం చేస్తోందని వివరించారు. చివర్లో ఈ సంవత్సరం నేరేడు పండ్లను ఆస్వాదిద్దామని.. అదే సమయంలో నీరు వంటి సహజ వనరులను పొదుపుగా, బాధ్యతతో ఉపయోగించాల్సిన అవసరాన్ని కూడా గుర్తుంచుకుందామని ఆ నెటిజన్ చేసిన పోస్ట్‌కు భారీగా కామెంట్ల వర్షం కురుస్తోంది.