
డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తున్నారా? ఇకపై అక్కడ దళారుల మాయ సాగదు. మధ్యవర్తుల మాట చెల్లదు. ఇతరుల సిఫార్సు నడవదు. కొత్తగా తీసుకొచ్చిన సెన్సర్ టెస్టింగ్ విధానం ట్రాక్‌పై వంద శాతం నైపుణ్యం ప్రదర్శిస్తేనే పాస్ చేస్తుంది. కొత్తగా స్టీరింగ్ పట్టాలనుకునేవారికి అధికారికంగా లైసెన్స్ జారీ చేస్తుంది.
గతంలోలాగ మాన్యువల్ విధానంలో జరిగే పరీక్షలను పూర్తిగా నిలిపేశారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో రవాణా శాఖ ఈ టెస్టింగ్ విధానం అమలు చేస్తోంది. త్వరలో ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తారు. ఈ వార్త చదివారా: సీఎం చంద్రబాబును కలిసిన సాయికృష్ణ కుటుంబసభ్యులు