
భారత్‌లో అమెజాన్ 10వ ప్రైమ్ డే 72 గంట సేల్ త్వరలో అందుబాటులోకి SBI, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు అదనంగా 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఈ సేల్‌లో 100కు పైగా బ్రాండ్లతో 500కు పైగా కొత్త ప్రొడక్టులు...
భారత్‌లో అమెజాన్ 10వ ప్రైమ్ డే 72 గంట సేల్ త్వరలో అందుబాటులోకి SBI, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు అదనంగా 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఈ సేల్‌లో 100కు పైగా బ్రాండ్లతో 500కు పైగా కొత్త ప్రొడక్టులు రిలీజ్ Amazon Prime Day 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఏదైనా కొందామని అనుకుంటున్నారా? అయితే, మీకోసం అమెజాన్ అద్భుతమైన సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లతో మళ్లీ వస్తోంది. దేశంలో 10వ వార్షిక ప్రైమ్ డే సేల్ తేదీలను అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. తద్వారా వినియోగదారులు స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోం అప్లియన్సెస్ మరిన్నింటిపై అద్భుతమైన డీల్స్ పొందవచ్చు. ఈసారి సేల్ 3 రోజుల పాటు ఉంటుంది. అలాగే ప్రైమ్ మెంబర్‌షిప్‌పై కొత్త డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఏఐ-ఆధారిత షాపింగ్ టూల్స్ (Amazon Prime Day 2026) కూడా అందించనుంది. మీరు అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026కి సంబంధించిన తేదీలు, ఆఫర్లు, కొత్త లాంచ్‌లు, మెంబర్షిప్ బెనిఫిట్స్ వంటి పూర్తి వివరాలను చెక్ చేయొచ్చు. జూలై 4న సేల్ ప్రారంభం : ఈ ఏడాదిలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 4న అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. జూలై 6న రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది. ఈ సేల్ మొత్తం 72 గంటల పాటు కొనసాగుతుంది. గత ఏడాదిలో మాదిరిగానే ఈ సేల్ కేవలం ప్రైమ్ సభ్యులకు మాత్రమే స్పెషల్ అని చెప్పొచ్చు. అమెజాన్ అనేక డిజిటల్ పేమెంట్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈఎంఐలతో సహా ఈ సేల్ సమయంలో 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు కూడా తమ ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా చేసే కొనుగోళ్లపై 5శాతం వరకు అన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. Read Also : Samsung Galaxy M47 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న బిగ్ ఫోన్ ఇదే.. ఫీచర్లపై భారీ హైప్.. ధర ఎంత ఉండొచ్చంటే? ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా అమెజాన్ పే లేటర్ : ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా మేక్మైట్రిప్, 'అమెజాన్ పే లేటర్'ను కూడా ఆఫర్ చేస్తోంది. తద్వారా వినియోగదారులు రూ. 1,500కుపైగా ఎక్కువ కొనుగోళ్లు చేస్తే 3 నో కాస్ట్ ఈఎంఐలుగా ఎంచుకోవచ్చు. ఈ ఏడాది ఆఫర్లలో ట్రావెల్ బుకింగ్‌లు కూడా ఉన్నాయి. మేక్మైట్రిప్ యూజర్లకు తక్షణమే 10శాతం తగ్గింపు, హోటళ్లపై 75శాతం వరకు, బస్ టిక్కెట్లపై 17శాతం వరకు సేవ్ చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ డే 2026లో 100కు పైగా భారతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల నుంచి 500కుపైగా కొత్త ప్రొడక్టులు ఉండనున్నాయి. శాంసంగ్, వన్‌ప్లస్, హెచ్‌పీ, లెనోవా, ఆసుస్, ఐక్యూ, రెడ్మి వంటి ప్రముఖ బ్రాండ్లు పాల్గొంటాయని భావిస్తున్నారు. అడిడాస్, అలెన్ సోలీ, ప్యూమా, వాన్ హ్యూసెన్ వంటి ఫ్యాషన్ బ్రాండ్లతో పాటు ఎల్జీ, బాష్, క్రాంప్టన్ షార్క్ నింజా వంటి హోం అప్లియన్సెస్ తయారీదారులు కూడా పాల్గొంటారని అంచనా.. కొనుగోలుదారులకు ప్రొడక్టుల సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు ఇప్పటినుంచి ఏఐ ఆధారిత టూల్స్ వాడుకుంటామని అమెజాన్ చెబుతోంది. అమెజాన్ ప్రైమ్ కోసం వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ సబ్స్క్రిప్షన్ ధరలపై భారీ తగ్గింపు ప్రకటించింది. స్టాండర్డ్ ప్రైమ్ మెంబర్షిప్ రూ. 1,499 నుంచి రూ.999కే ఆఫర్ చేస్తోంది. ప్రైమ్ లైట్ ధర రూ. 799 నుంచి రూ.599కి తగ్గింది. ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ కూడా రూ. 399 నుంచి రూ. 299 తగ్గింపు ధరకే లభిస్తోంది.