
Janasena : తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని మణికొండలో నూతనంగా నిర్మించిన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు.
శాస్త్రోక్తంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, పవన్ కళ్యాణ్ ‘తెలంగాణ తల్లి’ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసైనికులు, నేతలలో ఆయన సరికొత్త జోష్ నింపారు.
ఏపీలో సాధించిన అద్భుత విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న జనసేనాని, ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీ కేడర్‌ను యాక్టివ్ చేసి, క్షేత్రస్థాయి నుండి సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. Read Also : ప్రజల కోసం రాజకీయం చేయాలన్న గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ మణికొండలో సరికొత్త పార్టీ కార్యాలయం అందుబాటులోకి రావడంతో తెలంగాణలో జనసేన రాజకీయ కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయి.
ముఖ్యంగా రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలను టార్గెట్ చేస్తూ పార్టీ అగ్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి హైదరాబాద్ నగర పరిధిలో బలీయమైన శక్తిగా ఎదగాలని, మెజారిటీ స్థానాల్లో పోటీకి దిగాలని పార్టీ వర్గాలు గట్టిగా భావిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ క్రేజ్, యువతలో ఉన్న ఆదరణను ఓట్లుగా మలుచుకుంటూ.. తెలంగాణలో పార్టీ ఉనికిని చాటడమే కాకుండా, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగడమే లక్ష్యంగా జనసేన ఇక్కడ దూకుడు పెంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Jio Satellite Internet: టవర్లు లేకుండానే ఇంటర్నెట్ సేవలు.. జియో కొత్త టెక్నాలజీకి శ్రీకారం గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
మళ్లీ సీఎం అవుతారు: కడియం శ్రీహరి
Gandhi Sarovar project: గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Mahesh Kumar Goud: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యం: మహేశ్ గౌడ్
Rahul Gandhi birthday: ప్రజల కోసం రాజకీయం చేయాలన్న గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ
Asifabad couple murder: దంపతుల దారుణ హత్య.. పీరిల ఉదంతమే ప్రాణం తీసిందా..?
Rental rules: అద్దెదారులకు శుభవార్త.. కేంద్రం కొత్త నిబంధనలు!
Kadiyam Srihari: రాహుల్ ప్రధాని, రేవంత్