
Jio Satcom | దిల్లీ: టెలికాం సేవల విభాగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న జియో... ఇప్పుడు స్వదేశీ కమ్యూనికేషన్ ఉపగ్రహాల ద్వారా అంతరిక్షం నుంచి కనెక్టివిటీని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు శాట్‌కామ్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కంపెనీ చూస్తోందని జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తెలిపారు.
ప్రస్తుతం శాటిలైట్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, ఫ్రాన్స్‌కు చెందిన యుటెల్‌శాట్ వంటి విదేశీ కంపెనీల హవా నడుస్తోంది. ఈ విభాగంలో జియో కూడా అడుగుపెట్టబోతోంది. ‘‘జియో భారతదేశాన్ని భూమిపై అనుసంధానించింది.
ఇప్పుడు అంతరిక్షం నుంచి అనుసంధానించాలి. జియో నెట్వర్క్ చేరుకోలేని మారుమూల గ్రామాలు, ద్వీపాలు, సరిహద్దు ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. వాటిని అనుసంధానం చేయడానికి శాటిలైట్ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. ఇందుకోసం సొంతంగా లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ వ్యవస్థను అభివృద్ధి చేయడాన్ని జియో పరిశీలిస్తోంది’’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంలో ఆకాశ్ అంబానీ వెల్లడించారు.
దీర్ఘకాలంలో సొంతంగా శాటిలైట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటూనే.. మరోవైపు సేవల లభ్యతను వేగవంతం చేయడానికి తాము అంతర్జాతీయ సంస్థలతో శాటిలైట్ సామర్థ్యాన్ని లీజుకు తీసుకుంటామని ఆకాశ్ అంబానీ తెలిపారు. దీనివల్ల మన కనెక్టివిటీ అవసరాలను జియో వేగంగా తీర్చడంతో పాటు ప్రపంచ స్థాయి భారతీయ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాట్‌ఫారమ్‌కు పునాది వేస్తుందని వివరించారు.
అలాగే, జియో తన సొంత గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాలను కూడా నిర్మిస్తోందని చెప్పారు. అంతరిక్ష రంగంలో జియో ఆత్మనిర్భరత వైపు అడుగులు వేస్తోందన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రత్యప్రసారం మీ కోసం...
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ