
దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం ఇప్పుడు విరాళాల వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీస్తుండగా తాజాగా రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.మందిర నిర్వహణ వ్యవస్థలో తీవ్రమైన లోపాలున్నాయని, మొత్తం యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నృపేంద్ర అభిప్రాయపడ్డారు.
అనుభవం ఉన్న నిపుణుల చేతుల్లో నిర్వహణ బాధ్యతలు ఉండాలని సూచించారు. విరాళాల లెక్కల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆలయ ఉద్యోగి ఇంటి నుంచి నగదు స్వాధీనం కావడం కలకలం రేపింది.
అనంతరం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. విరాళాల రిజిస్టర్లు, భద్రతా రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు.అయితే ‘శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్’ఈ ఆరోపణలను ఖండించింది.
తమ ఖాతాలు సక్రమంగా ఉన్నాయని, ఎలాంటి అవకతవకలు గుర్తించలేదని ట్రస్ట్ చెబుతోంది. ఈ వివాదం తనను వ్యక్తిగతంగా చాలా బాధించిందని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ముఖ్యంగా రామమందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం విచారకరమన్నారు.
ప్రస్తుతం ఆలయ నిర్వహణలో ఎక్కువ మంది స్వచ్ఛంద సేవకులే పనిచేస్తున్నారని నృపేంద్ర తెలిపారు. కానీ ఎవరి బాధ్యత ఏంటో స్పష్టంగా రాతపూర్వక ఆదేశాలు లేవని, పని విభజన కూడా సక్రమంగా జరగడం లేదని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో దాదాపు 1,500 మంది వివిధ పనుల్లో