
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఈవో శీనా నాయక్ శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు, శానిటేషన్, భద్రతపై అధికారులతోపాటు సిబ్బందికి ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడ, జూన్19: దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యమని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో) శీనా నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఈవో శీనా నాయక్ విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు, శానిటేషన్, భద్రతపై అధికారులతోపాటు సిబ్బందికి ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. దుర్గా ఘాట్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వారికి స్పష్టం చేశారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేయాలని సూచించారు.
దుర్గా ఘాట్లో ‘మన మిత్ర’ వాట్సాప్ టికెటింగ్ సేవలను ఈ సందర్భంగా దేవస్థానం ఈవో పరిశీలించారు. కేశఖండనశాలలో సిబ్బంది హాజరు, ఫిర్యాదుల రిజిస్టర్ను తనిఖీ చేశారు. అలాగే ఆలయంలో అందుతున్న సేవలపై అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడారు.
ఎస్బీఐ విరాళంగా ఇచ్చిన సిమెంట్ కుర్చీలపై భక్తుల హర్షం వ్యక్తం చేశారు. కొత్త షెడ్లతోపాటు కూర్చోవడానికి చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి చెందారు. కనకదుర్గ నగర్లో హాకర్ల నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను ఈవో శీనా నాయక్ పరిశీలించారు.
ప్రసాదం కౌంటర్లలో స్టాక్ నాణ్యతను తనిఖీ చేశారు. మహా మండపంలో కొత్త వాట్సాప్ బుకింగ్ కౌంటర్లను కూడా ఆయన తనిఖీ చేశారు. పాత మెట్ల మార్గంలో భక్తుల సౌకర్యాలను సైతం ఈవో పరిశీలించారు. క్యూ లైన్లలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి సౌకర్యాలను ఈవో పరిశీలించారు.
ఇనుప కుర్చీలను ఏర్పాటు చేశారు.
రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ వెల్లడించారు. ఘాట్ రోడ్డులో భక్తుల కోసం 800