
Sunaina Khalid Breakup: టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రముఖ నటి సునయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ, తన ప్రియుడితో బ్రేకప్ చెప్పుకుందనే ప్రచారం సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
నటి సునయన గత కొంతకాలంగా యూఏఈకి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఖాలిద్ అల్ అమెరితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి బంధం కేవలం డేటింగ్‌కే పరిమితం కాకుండా నిశ్చితార్థం వరకు కూడా వెళ్లింది. గతంలో తాము చేతులు కలిపిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సునయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..
తమ నిశ్చితార్థం జరిగినట్లు హింట్ ఇచ్చారు. ఆ సమయంలో ఈ జంటకు నెటిజన్ల నుండి భారీగా శుభాకాంక్షలు వచ్చాయి. తాజాగా వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారనే వార్తలకు ఓ బలమైన కారణం కనిపిస్తోంది. సునయన తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి తన ప్రియుడు ఖాలిద్‌తో దిగిన ఫోటోలన్నింటినీ ఒక్కొక్కటిగా డిలీట్ చేశారు.
సాధారణంగా సెలబ్రిటీలు విడిపోయే ముందు సోషల్ మీడియాలో ఫోటోలు తొలగించడం సర్వసాధారణం కాబట్టి, వీరిద్దరి పెళ్లి ముచ్చట ఆగిపోయిందని నెటిజన్లు ఫిక్స్ అవుతున్నారు. అయితే ఈ ఫోటోల డిలీట్ వ్యవహారంపై నటి సునయన కానీ, అటు ఖాలిద్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మహారాష్ట్రకు చెందిన సునయన మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, 2005లో తెలుగు సినిమా 'కుమార్ వర్సెస్ కుమారి' చిత్రంతో హీరోయిన్గా పరిచయమయ్యారు. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన 'రాజరాజ చోర' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' సినిమాలో నాగార్జున భార్య పాత్రలో నటించింది.
ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న తరుణంలో ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ పరిణామం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా
మారింది.