
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ: వడ్డే నవీన్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తనే నిర్మాతగా హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’.
కమల్ తేజ నార్ల ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. వడ్డే నవీన్ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు నిర్మాతగా ఈ మూవీని తెరకెక్కించడంతో పాటు ఈ మూవీ ప్రమోషన్స్‌ను గట్టిగానే చేశాడు. మరి ఈ సినిమాతో వడ్డే నవీన్ తాను కోరుకున్న హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
త్రిమూర్తులు నిజాయితీగల పోలీస్ కానిస్టేబుల్. తన నిజాయితీ కారణంగా దాదాపు 10 యేళ్లలో 51 ట్రాన్స్ఫర్స్ అవుతాయి. ఈ క్రమంలో తన తండ్రి పనిచేసిన పాత పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ అతనికి 21 ఏళ్ల క్రితం జరిగిన ఒక గిరిజన యువతి ‘ప్రియమ్మ’కు జరిగిన అత్యాచారానికి సంబంధించిన పాత FIR కాపీ దొరుకుతుంది.
ఇక గిరిజన యువతి పై అప్పటి హోం మినిష్టర్ ప్రస్తుత ముఖ్యమంత్రి కమలాదేవి కుమారుడు సంతోష్అత్యాచారం చేస్తాడు. కట్ చేస్తే 21 యేళ్ల తర్వాత ఆ కేసును రీ ఓపెన్ చేస్తాడు. ఈ సందర్బంగా కానిస్టేబుల్ త్రిమూర్తులు ప్రియమ్మ పై జరిగిన అత్యాచారం కేసులో కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్న సంతోష్‌కు శిక్ష వేయించాడా లేదా ఈ క్రమంలో అతను ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసాడు.
పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యంత కింది స్థాయిలో ఉండే ఓ కానిస్టేబుల్ పెద్ద రాజకీయ నాయకులను
ఎలా ఎదుర్కొన్నాడనే ఈ సినిమా స్టోరీ.
దర్శకుడు కమల్ తేజ్ నార్ల .. ఒక పాయింట్ చుట్టూ ఈ కథను అల్లుకున్న విధానం బాగుంది. ఇక వడ్డే నవీన్ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే ఏదో సాదాసీదా కథ కాదని ముందు నుంచి తన ప్రమోషన్స్‌లో భాగంగా అదే చెప్పాడు. దర్శకుడు కమల్ తేజ నార్ల కూడా ఈ సినిమా కథ రాసుకున్నా విధానం బాగుంది. సమాజంలో ఏ వ్యవస్థ అయిన న్యాయంగా ఉండాలంటే అందులో పనిచేసే వాళ్లు నిజాయితీ పరులై ఉండారు. నిజాయితీ పరులైన వాళ్లతోనే ఏ అండ లేని వాళ్లకు న్యాయం అనేది దక్కుతుందనే అనే విషయాన్ని ఈ సినిమాలో చూపెట్టే ప్రయత్నం చేసాడు. నిజాయితీగల ఓ కానిస్టేబుల్ కాబోయే ముఖ్యమంత్రికి దోషిగా ఎలా నిరూపించాడనే పాయింట్ రొటీన్‌గా ఉన్నా.. దాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది.
ఎపుడో 2005లో ఓ గిరిజిన యువతి పై రాజకీయ నాయకుడు కుమారుడు అత్యాచారం చేయడం. ఆపై అన్యాయం జరిగిన యువతికి అండగా నిలబడే కానిస్టేబుల్.. ఈ క్రమంలో పై అధికారులు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అతను వారిపై పోరాడుతూ చనిపోవడం.. ఆ తర్వాత 21 యేళ్లకు ఈ కేసును అతని కుమారుడు యాదృచ్చికంగా తిరిగి ఓపెన్ చేయడం ఈ క్రమంలో ఈ కేసును చేధించడం. ఈ క్రమంలో అతనిపై రాజకీయ ఒత్తిళ్లు .. ఎత్తుకు పై ఎత్తులు వేయడం వంటివి ఆడియన్స్‌కు ఎక్కడా బోర్ కొట్టదు. తన తండ్రి న్యాయం చేయలేకపోయిన అమ్మాయికి .. త్రిమూర్తులు ఎలా న్యాయం చేసాడు అనే పాయింట్ బాగుంది. దాదాపు దశాబ్దం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమాలో వడ్డే నవీన్.. పదేళ్ల క్రితం ఎలా ఉన్నాడో.. ఇపుడు కూడా అలానే కనిపించి వావ్ అనిపించాడు. ఈ విషయాన్ని సినిమాలో ఓ జర్నలస్ట్ పాత్రతో చెప్పించాడు దర్శకుడు. పాటల్లో ఈజ్ కనిపించింది. ఫైట్స్ కష్టపడి చేసినట్టు కనిపించింది. అయినా పర్వాలేదు.
ఇందులో ముఖ్యమంత్రి కమలా దేవి పాత్రను జయలలితను ఇన్స్ప్రిషన్గా తీసుకొని తనదైన శైలిలో అల్లుకున్నాడు దర్శకుడు. ఆ పాత్రలో మంచి నటన కనబరిచింది. విలన్ పాత్ర కూడా బలంగా ఉండటంతో పాటు భావోద్వేగాలు, ఎమోషన్స్ అన్ని పండాలి. కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పాటలు, ఓ ఐటెం సాంగ్ కూడా పెట్టాడు. క్లైమాక్స్ ఫైట్.. చివర్లో కోర్టు సీన్ తో ఎండ్ చేయడం బాగుంది. చివర్లో విలన్‌ను ఎలా ఇరికించాడనే పాయింట్ ప్రేక్షకులను మెప్పించింది. అది ఎన్నో పాత సినిమాల్లో రొటీన్ గా ఉన్నా.. బాగుంది. ఓ సాదారణ కానిస్టేబుల్ .. ముఖ్యమంత్రి పీఠంలో ఉన్న వారితో ఫైట్ అనేది సాధ్యం కానీ విషయం. సినిమా కాబట్టి లాజిక్ అడగద్దు. సినిమాకు కళ్యాణ్ నాయక్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా వడ్డే నవీన్ చాలా కాలం తర్వాత ఈ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఈ సినిమా కమర్షియల్‌గా ఏ మేరకు సక్సెస్ అందుకుంటుందనేది చూడాలి. ఒక కమర్షియల్ సక్సెస్ కాకపోయినా.. ఓటీటీ వేదికగా దుమ్ము రేపడం ఖాయం.
వడ్డే నవీన్ చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాలో సెటిల్డ్ పర్ఫామెన్స్ చేశాడు. పాటల్లో మంచి ఈజ్ కనబరిచాడు. ఫైట్స్ పర్వాలేదు. దాదాపు రీ ఎంట్రీలో నిర్మాతగా, హీరోగా సక్సెస్ అందుకున్నాడు. ఇక ముఖ్యమంత్రి కమలాదేవి పాత్రలో నటించిన శిల్పా తులాస్కర్ నటన బాగుంది. ఆమె కుమారుడి సంతోష్ పాత్రలో నటించిన నటుడు తన విలనిజం పండించాడు. హీరో తండ్రి పాత్రలో దేవీ ప్రసాద్ నటన బాగుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సూర్య క్లైమాక్స్‌లో మెరిపించింది. హీరోయిన్ రాశీ సింగ్ పర్వాలేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’.. ఎంగేజ్ చేసే క్రైమ్ త్రిల్లర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.