
Read Also : Rental rules: అద్దెదారులకు శుభవార్త.. కేంద్రం కొత్త నిబంధనలు! చాలామంది జీవితాలు ఈఎంఐల కొరల్లో నలిగిపోతున్నా యి. నెలసరి వాయిదాలు చెల్లింపుల కోసం మధ్యతరగతి కుటుంబాలు తమ ప్రాథమిక అవసరాలను సైతం త్యాగం చేస్తున్నాయి.
చిన్నచిన్న కోరికలను చంపుకుంటున్నాయి. విద్యతోనే బంగారు భవిష్యత్ ఉంటుందని భావించే క్రమం లో పిల్లలను నాణ్యమైన విద్యకు దూరం చేస్తున్నాయి. నెలవారీ వాయిదాల భయంతో పిల్లలను మంచి స్కూళ్లలో చదివించలేక సాధారణ పాఠశాలలకు మారుస్తున్న తల్లిదం డ్రులు ఎందరో.
అటు అప్పులు తీర్చలేని క్రమంలోఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించాల్సిన దుస్థితి బడుగు జీవులది. చిన్నపాటి జబ్బులొస్తే ఆసుపత్రికి వెళ్లకుండా మెడికల్ షాపుల్లో మందులు, మాత్రలు తెచ్చుకుని సర్దుకుపోవాల్సిన సందర్భాలు అనేకం. ఇక పెద్ద వైద్యం ఖర్చు వస్తే అప్పుల పాలే గతి.
సాధారణంగా మధ్యతరగతి వారి ఆదాయం పరిమితంగా ఉంటుంది. బ్యాంకులోను తీసుకుని ఇల్లు కొన్నప్పుడు, ఆ ఆదాయంలో సగానికి పైగా నెలసరి వాయిదాలకే సరిపోతుంది. ఏళ్లు గడుస్తున్నా జీతాలు పెరిగే వేగం కంటే ఖర్చులు పెరిగే వేగం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటం వల్ల నెలాఖరు వచ్చేసరికి జేబులు ఖాళీ అవుతు న్నాయి.
అనుకోని వైద్య ఖర్చులు రావడం, ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదురవడం, ఆర్థిక మాంద్యం వంటి పరిస్థి తులు సగటు పేద, మధ్యతరగతి జీవిని మరింత కృంగదీ స్తున్నాయి. ఇలాంటి చిన్నకుదుపు వచ్చినా సరే వారి ఆర్థిక ప్రణాళిక పేకమేడలా కూలిపోతోంది. నెలసరి వాయిదాలు సమయానికి చెల్లించలేక బ్యాంకుల నుంచి వచ్చే ఒత్తిళ్లు వారి ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తున్నాయి.
వెంటా డుతున్న ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్న అప్పులు ఒకపక్క ఇంటి ఈఎంఐ కట్టడానికి, మరోపక్క ఆ నెల గడవడానికి మధ్యతరగతి ప్రజలు క్రెడిట్‌కార్డులు, వ్యక్తిగత రుణాలు, అధిక వడ్డీలకు బయట అప్పులు చేయడం ప్రారంభిస్తారు. ఇది ఒక ప్రమాదకరమైన విషవలయం లాంటిది.
మీద వడ్డీలు పెరిగి పోయి అసలు కంటే వడ్డీతే భారంకావడం వంటి పరిణామా లు బలవన్మరణాలకు ఉసిగొలుపుతున్నాయి. మరో మార్గం కానరాక ఆత్మహత్యలే శరణ్యం అనుకునే పరిస్థితికి దారితీస్తున్నాయి. ఈ చక్రంలో చిక్కుకుని నిత్యం అప్పుల వాళ్ల వేధింపులు తట్టుకోలేక, పరువుపోతుందన్న భయంతో తీవ్ర మైన మానసిక ఒత్తిడికి గురువుతున్నారు. కరోనా తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు, వ్యాపారాల్లో నష్టపోయిన వారు ఈఎం ఐలు కట్టలేక నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. రిక వరీ ఏజెంట్ల వేధింపులు తాళలేకపోతున్నారు. ఒక్క నెల వాయిదా దాటితే చాలు.. బ్యాంకుల నుంచి వరుస ఫోన్ కాల్స్. రెండు నెలలు దాటితే ఇంటి ముందుకు రికవరీ ఏజెంట్లు. పరువుపోతుందనే భయంతో, ఆ క్షణానికి గట్టెక్క డానికి అప్పుల మీద అప్పులు, క్రెడిట్ కార్డుల మీద నగదు విత్ డ్రాలు చేస్తూ ఊబిలో కూరుకుపోతున్నారు.
‘సొంతిల్లు’ అనే సామాజిక హోదా కోసం, ఏమాత్రం ఆర్థిక ప్రణాళిక లేకుండా వేసే అడుగులు జీవితాన్ని అంధకారంలోకి నెట్టే స్తాయని చెప్పడానికి అనేకమంది పేద మధ్యతరగతి జీవుల గాథలే సజీవ సాక్ష్యం. ఇల్లు కొనాలనుకునే ముందు మన స్తోమత ఏంటి? అత్యవసర పరిస్థితులు వస్తే తట్టుకునే ప్రత్యామ్నాయం ఉందా? అని ప్రతి ఒకరూ తమనుతాము ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. గృహ రుణం తీసుకునే సమయంలో నెలవారీ ఈఎంఐలు చెల్లించగలమనే నమ్మకం ఉన్నప్పటికీ కాలక్రమేణా పరిస్థితులు మారిపోతుంటాయి. చాలా కుటుంబాలు ఇతర అవసరాలను వాయిదా వేసుకుం టూ, తమ కోరికలను త్యాగంచేస్తూ ఈఎంఐలు చెల్లించేం దుకు ప్రయత్నిస్తున్నాయి. కొందరు అదనపు ఉద్యోగాలు చేయడం, వ్యక్తిగత రుణాలు తీసుకోవడం వంటి మార్గాలను ఆశ్రయిస్తున్నారు. అయితే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారినప్పుడు ఈఎంఐలు చెల్లించడం సాధ్యమవుతోంది. నెలవారీ వాయి దాలు చెల్లించలేక బ్యాంకుల నుంచి నోటీసులు అందుకో వడం, జరిమానాలు పడటం, క్రెడిట్ స్కోర్ దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇళ్లను వేలం వేసే పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. దీంతో సొంతింటి కల ఆనందాన్ని ఇవ్వాల్సిన చోట ఆందోళనలకు కారణమవుతోంది. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అందమైన భావోద్వేగం, కానీ అది మన రోజువారీ ప్రశాంతతను హరించేదిగా మారకూడదు. తమ ఆదాయం, భవిష్యత్ అవసరాలను కచ్చితంగాఅంచనా వేసుకుని మాత్రమే ఇంటి బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. కనీసం ఆరు నెలలు ఈఎంఐలు, ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బును అత్యవసర నిధిగా పక్కన పెట్టిన తర్వాతే ఇంటి లోన్‌కు వెళ్లడం సురక్షితం. అదే సందర్భంలో కలలు కనడం తప్పు కాదు, కానీ ఆ కలల సాకారం మన వర్తమానాన్ని, భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేదిగా ఉండకూడదు.
NEET-UG : నీట్ యూజీ పునఃపరీక్ష వేళ.. విద్యార్థులకు సెలవులు ఇవ్వవద్దని వైద్య కళాశాలలకు కేంద్రం సూచన
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Digital addiction : పరిమితులతో డిజిటల్ అడిక్షన్‌కు చెక్!
Alternative crops : ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం
Childbirth : ఆధునిక రాజకీయంలో ‘ప్రసవ’ ప్రహసనం
Land values : పెరిగిన భూముల విలువలతో ఎవరికి లాభం?
Annamalai : అన్నామలై కొత్త ఒరవడిని సృష్టించగలరా?
ఒకఅప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం. వడ్డీల