
జ్యోతిష్యశాస్త్రంలో లగ్జరీ, ఐశ్వర్యం, ప్రేమ, ఆకర్షణలు, ఫ్యాషన్స్ కు కారకుడైన శుక్రుడు జూలై 29 ఉదయం 4.00 గంటల సమయంలో సూర్యుడికి చెందిన ఉత్తర ఫల్గుణి నక్షత్రం లోకి ప్రవేశిస్తున్నాడు. గ్రహాల రాకుమారుడైన శుక్రుడు, తేజోమయుడైన సూర్యుడి నక్షత్రంలోకి మారడం వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి.
ముఖ్యంగా ఈ 4 రాశుల వారికి దీర్ఘకాలిక సమస్యలు తీరిపోవడమే కాకుండా, ఊహించని ధనలాభాలు, వృత్తి ఉద్యోగాల్లో బంపర్ ఆఫర్లు లభించనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు తెలుసుకుందాం.సింహ రాశిసూర్యుడి నక్షత్రంలోకి శుక్రుడి రాక సింహ రాశి వారికి అన్ని రంగాల్లోనూ విజయాలను అందిస్తుంది.
మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లి పీటల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తప్పుడు నిర్ణయాలకు దూరంగా ఉంటూ, పాత సమస్యలన్నింటినీ చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.తులా రాశిశుక్రుడి అనుగ్రహం వల్ల తులా రాశి వారికి తిరుగులేని అదృష్టం వరించబోతోంది.
ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రశంసలతో పాటు అద్భుతమైన పదోన్నతులు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎంతటి కష్టమైన పరిస్థితినైనా మీ లైఫ్ పార్ట్నర్ సహాయంతో సులభంగా అధిగమిస్తారు. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. పాత బాకీలు వసూలై ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.మేష రాశిఈ నక్షత్ర మార్పు వల్ల మేష రాశి వారికి వ్యాపార, వృత్తిపరంగా గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతోంది.
వివేకం పెరిగి, భవిష్యత్తుకు ఉపయోగపడే అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి, పెట్టుబడుల ద్వారా లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది, బంధాలు మరింత బలపడతాయి.మిథున రాశిమిథున రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అమృత ఘడియలను మోసుకొస్తుంది.
.
మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు వచ్చి, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి, మానసిక ఒత్తిడి దూరం అవుతుంది