
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. కన్నబిడ్డల ముందే భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు.
ఆమెకు గుండు గీయడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించాడు. జూన్ 14న ఈ ఘటన చోటుచేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
పాండోపారా గ్రామానికి చెందిన జితేంద్ర ఘాసియా 15 ఏళ్ల క్రితం బాధితురాలిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. అయితే, భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఘాసియా.. ఏడాది క్రితం ఆమెను వదిలి వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు తనకు తెలిసిన వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జూన్ 14న గ్రామానికి వచ్చిన ఘాసియా భార్య పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు.
కన్న బిడ్డల ముందే తొలుత ఆమె కాళ్లు, చేతులు కట్టేసి జుట్టు కత్తిరించాడు. అనంతరం వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో గుండు గీశాడు. అంతటితో ఆగకుండా మూత్రం తాగించడంతోపాటు ముఖానికి ఓ నల్లటి రంగు పులిమాడు. ఆమెపై తీవ్రంగా దాడి చేయడంతో పాటు చంపేస్తానని బెదిరించాడు. ఈ చిత్రహింసలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరుసటి రోజు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా పోలీసులు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.