
టాలీవుడ్లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి (Priyadarshi) ప్రస్తుతం హీరోగా కొనసాగుతోన్న విషయం తెల్సిందే. టాలీవుడ్లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి (Priyadarshi) ప్రస్తుతం హీరోగా కొనసాగుతోన్న విషయం తెల్సిందే.
కోర్ట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రియదర్శి ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా అవి ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే ఈసారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే ప్రియదర్శి హీరోగా సరికొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రంతో వంశీ రెడ్డి దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం కాబోతుండగా.. సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) తో కలిసి బన్నీ వాస్ (Bunny Vas) నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ప్రముఖ జానపద గాయని, డాన్సర్ నాగదుర్గ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.
ఫోక్ స్టార్ గా నాగదుర్గకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే ఈ చిన్నది తమిళ్ లో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. లవ్.. ఓ లవ్ అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. ధనుష్ దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలో హీరోగా నటించిన పవిష్ నారాయణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్దమవుతోంది.
ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే నాగదుర్గ తెలుగులో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫోక్ సింగర్ నాగదుర్గ మొదటి సినిమానే సుకుమార్ రైటింగ్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లో అవకాశం రావడం టాలీవుడ్లో పెద్ద సంచలనంగా మారింది.
సుకుమార్ కథల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ ఎంత పవర్‌ఫుల్‌గా, నేటివిటీతో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు నాగదుర్గ లాంటి ఒక లోకల్ టాలెంట్‌ని మెయిన్ లీడ్‌గా పెట్టడం వెనుక దర్శకుడు వంశీ రెడ్డి
ఒక అద్భుతమైన పల్లెటూరి నేపథ్యమున్న కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రియదర్శి, నాగదుర్గ కాంబినేషన్ స్క్రీన్ పై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి తెలుగు, తమిళ్ భాషల్లో ఈ ఫోక్ స్టార్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.