
తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి టాటా టియాగో ఈవీ మంచి ఆప్షన్. ఇప్పుడు 2026 మోడల్లో చాలా కీలకమైన అప్డేట్స్తో ఈ హ్యాచ్‌బ్యాక్ సరికొత్తగా మార్కెట్లోకి వచ్చేసింది. కొత్త ఫ్రంట్ డిజైన్, ప్రీమియం క్యాబిన్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ వంటి ఫీచర్లు ఈ కారు విలువను మరింత పెంచాయి.
ఈ కారును రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ కారులో 19.2kWh, 24kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. 24kWh మోడల్ 74 bhp పవర్, 114 Nm టార్క్ ఇస్తుంది. ఇది సిటీ రోడ్లపై ఎలాంటి శబ్దం లేకుండా స్మూత్‌గా నడుస్తుంది.
స్పోర్ట్ మోడ్‌లో పెడితే చాలా వేగంగా యాక్సిలరేట్ అవుతుంది. గరిష్ఠంగా గంటకు 122 కి.మీ వేగాన్ని అందుకోగలదు. డ్రైవ్, రివర్స్, న్యూట్రల్, స్పోర్ట్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్లు ఉండటంతో, డ్రైవింగ్ చాలా సులభంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే 2026 టాటా టియాగో ఈవీ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, మెరుగైన భద్రత, ఫాస్ట్ ఛార్జింగ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి పనితీరును అందిస్తోంది.
మొదటిసారి ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి, పెట్రోల్ కారు నుంచి ఎలక్ట్రిక్ కారుకు మారాలనుకునే వారికి ఇది కచ్చితంగా పరిశీలించాల్సిన ఆప్షన్
.