
పాకెట్ స్పీకర్స్ వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. బ్యాగు, జేబులో, చేతిలో కూడా పట్టుకుని వెళ్లిపోవచ్చు. బయట అవుటింగ్ కు వెళ్లినప్పుడు పెద్ద పెద్ద స్పీకర్లకు బదులు ఇవి వెంట తీసుకెళ్లొచ్చు. చాలా మోడల్స్ బ్లూటూత్ కనెక్టివిటీ, రీఛార్జబుల్ బ్యాటరీ, అద్భుతమైన సౌండ్ క్వాలిటీతో వస్తాయి.
పెద్ద ఖర్చేమీ కాదు. కేవలం రూ.500కే దొరికేస్తాయి. మీరు చాలా తక్కువ ధరలో స్పీకర్ కొనాలనుకుంటే, 5W పోర్టబుల్ బాస్ స్పీకర్ ఒక మంచి ఆప్షన్. ఈ కాంపాక్ట్ స్పీకర్‌ను మొబైల్, ల్యాప్‌టాప్, టీవీలకు సులభంగా కనెక్ట్ చేయొచ్చు. చిన్న సైజులో ఉన్నప్పటికీ, దీని సౌండ్ క్వాలిటీ, బాస్ చాలా బాగుంటాయి.
దీంతో మీకు నచ్చిన పాటలను ఎంజాయ్ చేయొచ్చు. ఇది మీకు shopclues సైట్లో కేవలం రూ.139కే లభిస్తుంది. మీకు స్టైలిష్, కాంపాక్ట్ డిజైన్ నచ్చితే, ఈ రౌండ్ షేప్ పాకెట్ స్పీకర్ కొనండి. దీని సైజు ఎంత చిన్నగా ఉంటుందంటే, మీరు దీన్ని చేతిలో లేదా జేబులో సులభంగా పెట్టుకోవచ్చు.
కాంపాక్ట్ డిజైన్‌తో పాటు ఇది పవర్ఫుల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. అమెజాన్‌లో ఈ స్పీకర్ మీకు రూ.319 ధరకే దొరుకుతుంది. జెబ్రానిక్స్ తన అద్భుతమైన సౌండ్ సిస్టమ్‌లకు ప్రసిద్ధి. ఈ బ్రాండ్‌కు చెందిన 4W వేరబుల్ బ్లూటూత్ స్పీకర్ మైక్రోఫోన్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది.
ఇది దాదాపు 20 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. దీని తేలికైన, కాంపాక్ట్ డిజైన్ వల్ల ఇది ప్రయాణాలు, వాకింగ్, సైక్లింగ్, వర్కవుట్ సమయంలో ఉపయోగించడానికి బెస్ట్ ఆప్షన్. ఇది మీకు అమెజాన్‌లో కేవలం రూ.499కే లభిస్తుంది
.