
జపాన్‌కు చెందిన పరిశోధకులు ఒక అద్భుతమైన ఆవిష్కరణను వెలుగులోకి తీసుకువచ్చారు. ఆహార యోగ్యం కాని, వ్యర్థంగా పారేసే నూడుల్స్ సహాయంతో అత్యంత దృఢమైన, పర్యావరణహిత కాగితాన్ని వారు రూపొందిస్తున్నారు. ఉడన్ నూడుల్స్‌కు ప్రసిద్ధి చెందిన కాగవా ప్రిఫెక్చర్లో ఆహార వ్యర్థాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ వినూత్న ప్రక్రియను అభివృద్ధి చేశారు.కాగవా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ నవోటకా టనాకా నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేపట్టింది.
ఈ ప్రక్రియలో భాగంగా, పారేసిన నూడుల్స్‌ను నీరు, ఎంజైమ్లతో కలిపి గ్లూకోజ్‌గా మారుస్తారు. అనంతరం ఈ గ్లూకోజ్‌ను ఎసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియాకు ఆహారంగా ఇస్తారు. కొన్ని రోజుల వ్యవధిలో, ఈ సూక్ష్మజీవులు నీటి ఉపరితలంపై సెల్యులోజ్‌తో కూడిన ఒక పలుచని పొరను సృష్టిస్తాయి.
ఆ పొరను సేకరించి, గాలికి ఆరబెట్టడం ద్వారా నాణ్యమైన కాగితాన్ని తయారు చేస్తారు.ఈ పద్ధతిలో తయారైన కాగితం సాధారణ కాగితం కంటే ఎంతో దృఢంగా ఉండటమే కాకుండా, నీటిలో తడిసినా సులభంగా చిరగదని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా, ఇది పూర్తిస్థాయిలో బయోడిగ్రేడబుల్ కావడంతో పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.
ఒక సర్వింగ్ ఉడన్ నూడుల్స్‌తో సుమారు 5 నుంచి 10 వరకు ఏ4 సైజు కాగితపు షీట్లను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఈ పరిశోధన కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా, ఇప్పటికే ఒక స్థానిక సామాజిక సంక్షేమ సంస్థకు ఈ సాంకేతికతను బదిలీ చేశారు. తద్వారా దివ్యాంగులకు నూతన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
స్థానిక రెస్టారెంట్లు తాము పారేసే నూడుల్స్‌ను ఈ తయారీ కోసం