ఫాఫ్ డుప్లెసిస్ వావ్ అనిపించే ప్రదర్శన చేశాడు. 41 ఏళ్ల వయస్సులో కేవలం 46 బంతుల్లోనే సెంచరీ బాది తనలో ఇంకా సత్తా ఉంది అనిపించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఎప్పుడో గుడ్ బై చెప్పిన డుప్లెసిస్.. టీ20 లీగ్‌లలో మాత్రం కొనసాగుతున్నాడు.
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున చివరిసారిగా ఆడిన ఈ లెజెండ్.. ఐపీఎల్ 2026కు ముందు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా యూఎస్ఏ వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ టీ20లో చెన్నై సూపర్ కింగ్స్‌కి టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
టెక్సాస్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఫాఫ్ డుప్లెసిస్ మేజర్ లీగ్ 2026 తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది జట్టుకు మరచిపోలేని విజయాన్ని అందించాడు. సియాటెల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 221 పరుగుల లక్ష్యాన్ని నాటౌట్‌గా నిలిచి ఛేదించాడు.
మేజర్ లీగ్‌లో నాలుగు సెంచరీలు నమోదు చేసిన ఫాప్, ఈ లీగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సియాటెల్ ఆర్కాస్ టెక్సాస్ బౌలర్లను ఉతికారేసింది.
న్యూజిలాండ్ స్టార్ హిట్టర్ టిమ్ సైఫర్ట్ బౌండరీల మోత మోగించాడు. 66 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లతో 104 పరుగులు చేయగా.. షయాన్ జహంగీర్ 47 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు బాదాడు. ఆఖర్లో కెప్టెన్ మార్కస్ స్టాయినీస్ 3 బంతుల్లో 13 పరుగులు చేయడంతో సియాటెల్ 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రెండో బంతికే వికెట్ కోల్పోయింది. తెలుగు ఆటగాడు సాయితేజ ముక్కమల్ల తాను ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. తొలి ఓవర్లోనే వికెట్ పడినప్పటికీ ఫాఫ్ డుప్లెసిస్ సియాటెల్ బౌలర్లకు చుక్కలు చూయించాడు.
ప్లేలోనే 89 పరుగులు రాబట్టాడు. 21 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో రోస్సో 49 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ వెంటనే మిలింద్ కుమార్, శుభమ్ రంజనే కూడా అవుటవ్వడంతో 165కే నాలుగు వికెట్లు కోల్పోయింది. విమాన్ ముల్దర్‌తో కలిసి ఫాఫ్ డుప్లెసిస్ మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. 46 బంతుల్లో సెంచరీ చేసిన ఫాఫ్ 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 113 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ముల్దర్ కూడా 15 బంతుల్లో మూడు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. దాంతో టెక్సాస్ 18.3 ఓవర్లలోనే 221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
రీలీ రోస్సోతో కలిసి పవర్