
ఇంటర్నెట్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో విరాట్ కోహ్లీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒకేఒక్క ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీనే. రెండుసార్లు విజేతగా నిలవడంలో అతడిదే కీలక పాత్ర.
ఇప్పటికే అంతర్జాతీయంగా టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ తర్వాత ఆ ఫార్మాట్‌కూ గుడ్‌బై చెప్పేస్తాడని వార్తలు వస్తున్నాయి. అలాగే వచ్చే ఐపీఎల్ సీజన్ అనంతరం మెగా లీగ్‌కు వీడ్కోలు పలుకుతాడని చర్చ మొదలైంది.
అయితే, వీటిని ఆర్సీబీ సీఈవో రాజేశ్ మేనన్ కొట్టిపడేశారు. ‘‘ఒకే నాణేనికి ఆర్సీబీ, విరాట్ రెండు ముఖాలు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఒకవేళ అతడు క్రికెట్‌కు దూరమైనా సరే.. ఆర్సీబీలో భాగం కాకుండా ఉండటాన్ని మేం ఊహించలేం.
తప్పకుండా దీని గురించి ఆలోచన చేస్తాం. ఇప్పటికప్పుడు విరాట్ ఐపీఎల్‌ను వదిలిపెట్టడు. కనీసం మూడు లేదా నాలుగేళ్లు ఆడతాడు. అతడి ఫిట్నెస్ చాలా బాగుంది. ఇప్పటికీ పరుగుల దాహం తీరలేదు. ఇటీవల సీజన్లో కోహ్లీని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది’’ అని రాజేశ్ స్పష్టం చేశారు.
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్ అఫ్గాన్‌తో టెస్టు మ్యాచ్ ఆడింది. వన్డే సిరీస్ ఆడుతోంది. అయితే, గాయం కారణంగా విరాట్ అఫ్గాన్‌తో వన్డేలకు దూరంగా ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ నాటికి జట్టుతో పాటు చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.
‘‘విరాట్ రిహాబిలిటేషన్ మొదలైంది. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రిపోర్ట్ చేయనున్నాడు. అక్కడ ఫిట్‌నెస్‌పై అంచనాకు వచ్చి.. క్లియరెన్స్ జారీ చేయనుంది. అనుకున్నవిధంగా సాగితే.. కోహ్లీ ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ నాటికి సిద్ధంగా ఉంటాడు’’ అని పేర్కొన్నాయి.
, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి