
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Oppo Reno 16c 5g Launching Soon: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో భారత మార్కెట్లోకి మరో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.
దీనిని కంపెనీ అంతర్జాతీయంగా ఎంతో పేరు పొందించిన Reno సిరీస్‌లో మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ Oppo Reno 16c 5G మోడల్లో భారత్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన బ్యాటరీతో, అత్యంత చీప్ ధరలో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
లీకైన ధర, వేరియంట్లు.. ప్రముఖ టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ Oppo Reno 16c 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి మొత్తం రెండు వేరియంట్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీని బేస్ వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.
34,999 ధరతో విడుదల కాబోతోంది. ఇక రెండవ వేరియంట్ 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ ధర రూ. 37,999తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఎంతో అద్బుతమైన ఇది పాప్ వైట్, ట్విలైట్ వయొలెట్ వంటి కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్.. Oppo Reno 16c 5G స్మార్ట్‌ఫోన్ 6.57-ఇంచుల ఫుల్ హెచ్డీ+ (Full HD+) అమోలెడ్ (AMOLED) డిస్ప్లేతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి దీనివల్ల స్క్రోలింగ్‌తో పాటు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అత్యంత స్మూత్‌గా ఉంటుందని టెక్ నిపుణులు తెలుపుతున్నారు
. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పర్ఫార్మెన్స్ వివరాల్లోకి వెళితే.. ఇందులో 4 నానోమీటర్ల టెక్నాలజీతో తయారు చేసిన పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 (MediaTek Dimensity 7300) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇది LPDDR5X ర్యామ్‌తో పాటు UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తుండటం వల్ల మల్టీటాస్కింగ్ ఎంతో సులభంగా చేసుకోవచ్చు.
అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందించిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీని వెనక భాగంలో ఎంతో ప్రత్యేకమైన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అందులో అద్భుతమైన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ కలిగిన ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం గల 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరాను కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా కూడా ఉంటుంది. దీంతో పాటు ఫ్రంట్ భాగంలో వీడియో కాలింగ్ కోసం పవర్ఫుల్ 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించిన్నట్లు తెలుస్తోంది.
మెగా బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.. ఈ స్మార్ట్‌ఫోన్ అత్యంత అద్భుతమైన భారీ 6,500mAh బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ కాబోతోంది.. దీనిని వేగంగా ఛార్జ్ చేసేందుకు కంపెనీ 45W సూపర్ ఊక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించిన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త IP69 రేటింగ్‌తో అందుబాటులోకి వస్తోంది. దీని వల్ల దుమ్ముతో పాటు వాటర్ నుంచి ఫోన్‌కు పూర్తి రక్షణ లభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కనెక్టివిటీ పరంగా ఇందులో 5G నెట్వర్క్, ఎన్ఎఫ్సీ (NFC), స్టీరియో స్పీకర్ల సపోర్ట్ కూడా లభిస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.