
Sharmila Mandre Marriage News: ప్రముఖ కన్నడ నటి షర్మిల మాండ్రే త్వరలోనే పెళ్లి పీటలేకపోతున్నారని వార్త ప్రస్తుతం శాండిల్‌వుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపుగా 15 ఏళ్లుగా చిత్ర పరిశ్రమ రాణిస్తున్న ఈమె ఓ ప్రముఖ తమిళ నిర్మాతతో ఏడడుగులు వేయబోతున్నట్లు సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. షర్మిలా మాండ్రే ప్రముఖ తమిళ చిత్ర నిర్మాత సుధన్ సుందరంను వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవల విజయ్ సేతుపతి హీరో సంచలనం సృష్టించిన 'మహారాజ' సినిమాను నిర్మించింది ఈయనే. నటి షర్మిల మాండ్రే, నిర్మాత సుధన్ సుందరం మధ్య గతంలో ఏర్పడిన పరిచయం ఇప్పుడు ప్రణయంగా మారింది.
ఈ జంట జూన్ 25న నిశ్చితార్థం చేసుకోనున్నట్లు సమాచారం అందుతుంది. వివాహ వేడుక బెంగళూరు లేదా తమిళనాడులో నిర్వహించేందుకు ఇరు కుటుంబ సభ్యులకు ప్లాన్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితల సమక్షంలో నిరడంబరంగా నిశ్చితార్థం ముగించుకుని..
ఆ తర్వాత ఘనంగా వివాహం చేసుకోవాలని వీరిద్దరు భావిస్తున్నారట. ఈ పెళ్లి వార్తలపై షర్మిలా కానీ, సుదన్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు. 2007లో 'సజని' అనేక చిత్రంతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది షర్మిల మాండ్రే.
నటుడు దర్శన్ సరసన 'నవగ్రహ' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ తో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నటించిన 'కెవ్వు కేక' సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది. ఈమె కేవలం నటిగానే కాకుండా నిర్మాతగాను తన సత్తా చాటుకుంది
.