
Srikalahasti news:రూ.6.3కోట్లు రుణాల చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మహి ళలు ఆర్థికంగా ఎదగాలని, స్వయంఊపాధి సాధించి కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకో వాలని శాసనసభ్యుడు బొజ్జల సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం శ్రీకాళహస్తి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్య క్రమాలకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మహిళలకు కూటమి ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నరన్నారు. మహిళలను మహా రాణులను చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం యోచించి ‘పిఎం అజయ్ పథకాన్ని’ రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ళ పాటు పరిపాలించిన వైకాపా నేతలు కేంద్రం నుంచి వచ్చిన నిధులను స్వాహా చేసారని పంచాయతీలకు మంజూరు చేసిన నిధులను కూడా కరెంటు చార్జిలకు జమ చేసి పంచాయతీలను నిర్వీర్యం చేసారన్నారు.
Read also: Jonnagiri Sand Mining: ఇసుక లూటీపై ఇడి విచారణ Srikalahasti news:ప్రధాని ఆశయాలకు అనుగుణంగా.. నేడు రాష్ట్రంలో భారత ప్రధాని నరేంద్రమోదీ ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మోదీజీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ప్రాధన్యత ఇస్తున్నారని సుధీర్ రెడ్డి వివరించారు.
రానున్న పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అవకాశం కల్పించారన్నారు. నేడు తాను పిఎం అజయ్ పథ కంలో రూ.6.3కోట్ల రుణాల చెక్కును అందించటం గర్వకారణంగా ఉందన్నారు. మహిళలందరూ ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో ఉన్నత శిఖిరాలను అధిరోహించి ఆర్థిక స్వా లంబన సాధించాలని కోరుతున్నట్లు వివరిం చారు.
ఈ సమావేశంలో జడ్పిటిసి వెంకట సుబ్బారెడ్డి, శ్రీకాళహస్తి వ్యవసాయమార్కెటింగ్ కమిటి చైర్మెన్ రంగినేని చెంచయ్యనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణయాదవ్, కామే ష్ యాదవ్, బొల్లినేని జగన్నాధం నాయుడు, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. Shooting at New York : న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కాల్పుల కలకలం; జనం పరుగులు, ఒకరి అరెస్టు గమనిక
: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
El Nino impact: ఎల్‌నినో దెబ్బ.. భారత్‌లో 10 శాతం తగ్గనున్న వర్షపాతం
Jonnagiri Sand Mining: ఇసుక లూటీపై ఇడి విచారణ
New Ration Cards: కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు.. అప్లై చేసుకోండిలా
Gold Rate Today: నేటి బంగారం ధరలు.. 10 గ్రాములకు ఎంతంటే?
AP SSC Supplementary Results 2026: AP 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
Nara Lokesh : బెంగాల్ లో లోకేష్ పర్యటన..బెంగాల్ పథకాలపై ఆరా !