
కల్తీ పన్నీరును చూపిస్తున్న వైభవ్ గైక్వాడ్ అబిడ్స్: పన్నీరు అంటే స్వచ్ఛమైన పాలతో తయారు చేస్తారని అధిక శాతం ప్రజలకు తెలుసు. కానీ జంట నగరాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, పన్నీరు విక్రయ కేంద్రాల్లో కల్తీ జరుగుతోంది. పాలు లేని కల్తీ పన్నీర్ తింటున్న చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు.
ఈ క్రమంలోనే హెచ్– ఫాస్ట్ అధికారులు నగరంలోని 45 కల్తీ పన్నీరు తయారీ, విక్రయ కేంద్రాలపై దాడులు చేశారు. కల్తీ పన్నీరు, మలై పన్నీరు, చీజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉస్మాన్‌గంజ్‌లోని హెచ్ ఫాస్ట్ కార్యాలయంలో టాస్‌్కఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
కొంత మంది వ్యాపారులు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ తదితర రాష్ట్రాల నుంచి చీజ్డ్ అనలాగ్‌ను తీసుకొచ్చి పన్నీరుగా తయారు చేసి వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయాలు చేస్తున్నారు. అదే ఉత్పత్తిని లోప్యాట్ పన్నీర్, మీడియం ప్యాట్ పన్నీర్, ప్రెష్ పన్నీర్ వంటి తప్పుదారి పట్టించే పేర్లతో విక్రయిస్తున్నారని డీసీపీ వివరించారు.
పన్నీరు ప్యాకెట్లపై బ్యాచ్ నంబర్, గడువు తేదీ లేకుండా అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. కొంత మంది వ్యాపారులు అక్రమంగా లాభార్జన కోసం అక్రమాలకు పాల్పడున్నారని ఆయన చెప్పారు. పన్నీరు తయారీ కేంద్రాలపై అధికారులు దాడులు చేయగా.. అధిక నీరు, పాలేతర కొవ్వులు, కృత్రిమ పాలు, ఆహారానికి అనర్హమైన పదార్థాలు కలపడం లాంటి కల్తీ చర్యలను గుర్తించామన్నారు.
పన్నీరు ప్యాకెట్లపై లేబ్లింగ్ లేకపోవడంతో పాటు కేంద్రాల్లో చెల్లని లైసెన్సులు ఉండడం, అపరిశుభ్రమైన నిల్వ విధానాలను కూడా గుర్తించామన్నారు. కల్తీ, మిస్ బ్రాండెడ్ 825 కిలోల నకిలీ ఉత్పత్తులను స్వా«దీనపరచ్చుకున్నట్లు డీసీపీ తెలిపారు.
ప్రజలు పన్నీరు కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్‌పై లేబుల్, గడువు తేదీల వివరాలను తప్పనిసరిగా చూసి కొనుగోలు చేయాలని సూచించారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో నటి నోరా ఫతేహి సందడి (ఫొటోలు) రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు) మొనాకో వేకేషన్లో లైగర్
Jun 19 2026 12:15 PM | Updated on Jun 19 2026 12:28 PM
కల్తీ పన్నీరును చూపిస్తున్న వైభవ్ గైక్వాడ్
అబిడ్స్: పన్నీరు అంటే స్వచ్ఛమైన పాలతో తయారు చేస్తారని అధిక శాతం ప్రజలకు తెలుసు. కానీ జంట నగరాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, పన్నీరు విక్రయ కేంద్రాల్లో కల్తీ జరుగుతోంది. పాలు లేని కల్తీ పన్నీర్ తింటున్న చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలోనే హెచ్– ఫాస్ట్ అధికారులు నగరంలోని 45 కల్తీ పన్నీరు తయారీ, విక్రయ కేంద్రాలపై దాడులు చేశారు. కల్తీ పన్నీరు, మలై పన్నీరు, చీజ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
గురువారం ఉస్మాన్‌గంజ్‌లోని హెచ్ ఫాస్ట్ కార్యాలయంలో టాస్‌్కఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొంత మంది వ్యాపారులు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ తదితర రాష్ట్రాల నుంచి చీజ్డ్ అనలాగ్‌ను తీసుకొచ్చి పన్నీరుగా తయారు చేసి వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయాలు చేస్తున్నారు. అదే ఉత్పత్తిని లోప్యాట్ పన్నీర్, మీడియం ప్యాట్ పన్నీర్, ప్రెష్ పన్నీర్ వంటి తప్పుదారి పట్టించే పేర్లతో విక్రయిస్తున్నారని డీసీపీ వివరించారు. పన్నీరు ప్యాకెట్లపై బ్యాచ్ నంబర్, గడువు తేదీ లేకుండా అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.
కొంత మంది వ్యాపారులు అక్రమంగా లాభార్జన కోసం అక్రమాలకు పాల్పడున్నారని ఆయన చెప్పారు. పన్నీరు తయారీ కేంద్రాలపై అధికారులు దాడులు చేయగా.. అధిక నీరు, పాలేతర కొవ్వులు, కృత్రిమ పాలు, ఆహారానికి అనర్హమైన పదార్థాలు కలపడం లాంటి కల్తీ చర్యలను గుర్తించామన్నారు. పన్నీరు ప్యాకెట్లపై లేబ్లింగ్ లేకపోవడంతో పాటు కేంద్రాల్లో చెల్లని లైసెన్సులు ఉండడం, అపరిశుభ్రమైన నిల్వ విధానాలను కూడా గుర్తించామన్నారు. కల్తీ, మిస్ బ్రాండెడ్ 825 కిలోల నకిలీ ఉత్పత్తులను స్వా«దీనపరచ్చుకున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రజలు పన్నీరు కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్‌పై లేబుల్, గడువు తేదీల వివరాలను తప్పనిసరిగా చూసి కొనుగోలు చేయాలని సూచించారు.
ఫిఫా వరల్డ్‌కప్‌లో నటి నోరా ఫతేహి సందడి (ఫొటోలు)
రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)
మొనాకో వేకేషన్లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు
డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)
5000 మంది చొరబాటుదారులకు చుక్కలు.. సరిహద్దుల్లో భారత ఆర్మీ విశ్వరూపం!
సాయి కృష్ణ ఇంటికి ACP.. జగన్ దెబ్బకు దిగొచ్చిన పోలీసులు
తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!