
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ హాట్ టాపిక్. ఐపీఎల్లో అదరగొట్టడంతో టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. దీంతో అతడిపై అభిమానులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం వైభవ్ ఇండియా A జట్టు తరఫున ఆడుతూ శ్రీలంకలో ఉన్నాడు.
ముక్కోణపు సిరీస్ ముగిశాక.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఉంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తోనూ పొట్టి ఫార్మాట్లో ఐదు మ్యాచులను భారత్ ఆడనుంది. అయితే, అతడిని మరీ ఎక్కువగా విశ్లేషిస్తూ ఒత్తిడికి గురిచేయొద్దని టీమ్ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ క్రీడా పండితులు, అభిమానులకు సూచించాడు.
వైభవ్ ఇలానే టెస్టుల్లోనూ రాణిస్తే.. సుదీర్ఘ ఫార్మాట్‌కు మళ్లీ కళ వస్తుందని అభిప్రాయపడ్డాడు. ‘‘పరుగులు సాధించాలని అనుకోవడంతోపాటు ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాలనే బలమైన ఆకాంక్ష ఉండటమే వైభవ్ సూర్యవంశీలో నాకు నచ్చే అంశం. క్రీజ్‌లో నిలదొక్కుకుని ఆడగల సామర్థ్యం కూడా అతడి సొంతం.
టీ20 క్రికెట్ నుంచి వన్డేలకు.. ఆ తర్వాత టెస్టుల్లో వృద్ధి చెందితే మాత్రం సుదీర్ఘ ఫార్మాట్‌కు అద్భుతమైన కళ తీసుకురాగలడు. టెస్టు క్రికెట్ పునరుజ్జీవనంలో ఇలాంటి కుర్రాళ్లదే కీలక పాత్ర. వైభవ్ సూర్యవంశీ ఆటను చూసేందుకు అభిమానులు టీవీ ఆన్ చేస్తున్నారు.
ఫ్యాన్స్‌ను ఆకర్షించే సత్తా అతడికి సహజంగానే వచ్చింది. అయితే, వైభవ్ గురించి మరీ ఎక్కువగా విశ్లేషణలు చేసి.. అనవసర ఒత్తిడికి గురి చేయొద్దు. అతడు సహజసిద్ధమైన గేమ్‌ను ఆడేలా చూడాలి. ఒక్క సిరీస్‌లో ఏదైనా సరిగ్గా ఆడలేకపోతే వెంటనే సదరు ప్లేయర్‌ను జడ్జ్ చేయొద్దు.
కాస్త సమయం ఇవ్వాలి. తొలిసారి ఆడిన ఐపీఎల్‌లోనే అదరగొట్టాడు. ఇక ఇటీవల సీజన్లో చాలా అవార్డులను సొంతం చేసుకున్నాడు’’ అని క్రిష్ తెలిపాడు. ‘‘ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం రాకపోయినా ఫర్వాలేదు. రిజర్వ్ బెంచ్‌లో ఉండనివ్వండి.
కష్టమే అవుతుంది. అంతకుముందు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత్ ఆడనుంది. ప్రత్యర్థి చిన్న జట్టైనా.. పెద్ద జట్టైనా సరే వైభవ్‌ను మాత్రం స్వేచ్ఛగా ఆడేలా చూడాల్సిన బాధ్యత టీమ్ఇండియా మేనేజ్మెంట్పై ఉంది. ఇక్కడ సచిన్, వైభవ్‌ను పోల్చడం సరికాదు. సచిన్ గాడ్ ఆఫ్ క్రికెట్. ఈ కుర్రాడు సన్ ఆఫ్ గాడ్. సచిన్‌ను అలా వదిలేయండి.. అతడికి చేరువగా ఎవరూ రాలేరు. వైభవ్ తీరు భిన్నమైంది. తొలి బంతినే సిక్స్‌గా మలచాలని వైభవ్ అనుకుంటాడు. అతడి రిస్ట్, బ్యాట్ స్పీడ్ భలేగుంటుంది’’ అని శ్రీకాంత్ వెల్లడించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
అతడికి అంతర్జాతీయ క్రికెట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. సంజు శాంసన్ - అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వస్తే వైభవ్‌కు ప్లేస్ దొరకడం