
సంపన్న దేశాల కూటమి అయిన ‘గ్రూప్ ఆఫ్ సెవెన్’(జీ7) 52వ శిఖరాగ్ర సదస్సు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫాన్స్‌లోని ఎవియాన్ లే బైన్స్‌లో ఈ నెల 17 వరకు సదస్సు జరగనుంది.
Jun 19 2026 11:12 AM | Updated on Jun 19 2026 11:27 AM
సంపన్న దేశాల కూటమి అయిన ‘గ్రూప్ ఆఫ్ సెవెన్’(జీ7) 52వ శిఖరాగ్ర సదస్సు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫాన్స్‌లోని ఎవియాన్ లే బైన్స్‌లో ఈ నెల 17 వరకు సదస్సు జరగనుంది. ఈ సభ్య దేశాలతో పాటు ఆహ్వానిత హోదాలో భారత్, బ్రెజిల్, ఈజిప్టు, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సిరియా, ఉక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లు సదస్సులో పాల్గొననున్నాయి. అదీగాక ఇరాన్- అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత జరుగుతున్న సదస్సు కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సదస్సుకి ఓ తొమ్మిదేళ్ల చిన్నారి రాక అందర్నీ ఆశ్చర్యపరిచింది. పాపం అమె కెమెరా కంట పడకుండా ఉండేందుకు పడుతున్న తపన అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే..
ఆ ముద్దలొలికే పాప ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూమార్తె. ఫ్రాన్స్‌లో ఇటీవల జరుగుతున్న G7 సదస్సులో ప్రధాన ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ నాయకులు సమావేశమైనప్పుడు ఒక రసవత్తరమైన క్షణం ఎదురైంది. అందుకు సబంధించిన వీడియో అందరి హృదయాలను తాకింది.
అంతేగాదు కొన్ని గంటల్లోనే ఆ చిన్నారి రాకకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యి ఎవరా అమ్మాయ్ అని చర్చలు మొదలయ్యాయి. రాజకీయ చర్చలకు అతీతంగా ఆ చిన్నారే హాట్‌టాపిక్‌గా మారడం విశేషం. ఆ వీడియోలో ఇటలీ ప్రధాని మెలోని రాగానే అధికారులకు, స్వాగత ప్రతినిధి బృంద సభ్యులకు అభివాదం చేశారు. ఆమె వెనుక నిశబ్దంగా ఉన్న గినెవ్రా జియాంబ్రూనె కెమెరాల ముందు సిగ్గుపడుతూ..తల్లి చెంత ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో.
అయితే నెటిజన్లు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కుమార్తెను వెంటబెట్టుకుని అమ్మగా రెండూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు మెలోనిపై ప్రశంసలపై వర్షం కురిపించారు. తల్లిదండ్రులుగా మారిన ప్రపంచనాయకులంతా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంటారు కదా అంటూ పోస్టులు పెట్టారు. కొందరు మాత్రం ఆ చిన్నారి చాలా ముద్దుగా ఉంది. ఆమెకు సురక్షితమైన ప్రదేశం ఏదో బాగా తెలుసు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఎలాంటి డైటింగ్ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్ ..)
మొనాకో వేకేషన్లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు
డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)
హైదరాబాద్ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
సాయికృష్ణ కేసు వెనుక.. జనం తిరగబడితే తట్టుకోలేరు.. చివరికి జరిగేది ఇదే..
అనుమానపు మొగుడు.. చిత్రహింసలు పెట్టి చంపేశాడు
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..!