
గతంలో సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘మా ఇంటి బంగారం’పై అటు అభిమానుల్లోనూ, ఇటు పరిశ్రమలోనూ మంచి క్రేజ్ ఏర్పడింది.
దీనికి తోడు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేశాయి. Read also: KathaSudha : జూన్ 21 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు సిద్దమైన ‘కథాసుధ – సండే స్టోరీస్’ యునైటెడ్ స్టేట్స్ (USA)తో పాటు పలు ఓవర్సీస్ ప్రాంతాలలో ఈ సినిమా ప్రీమియర్ షోలు విజయవంతంగా ముగిశాయి.
సినిమాను వీక్షించిన ప్రవాసాంధ్రులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సమంత తన ఖాతాలో ఒక పక్కా కమర్షియల్ సాలిడ్ హిట్‌ను వేసుకుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నందిని రెడ్డి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను, యాక్షన్‌ను డీల్ చేసిన విధానం బాగుందని టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో సమంత నటన, ముఖ్యంగా ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని వీక్షకులు చెబుతున్నారు. ఇప్పటివరకు క్లాస్ మరియు గ్లామర్ పాత్రల్లో అలరించిన సమంత, ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఊరమాస్ యాక్షన్ ఎపిసోడ్స్‌లో అదరగొట్టిందని కొనియాడుతున్నారు.
ఎమోషనల్ సీన్స్‌లోనూ సామ్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిందని, వన్ మ్యాన్ షో (వన్ ఉమెన్ షో)గా ఈ సినిమాను నిలబెట్టిందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మొత్తం మీద ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి ఆరంభంలోనే సానుకూల స్పందన లభిస్తోంది.
Saikrishna Missing Case : సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం
. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Maa Inti Bangaram Talk : మా ఇంటి బంగారం – అదరగొట్టిన సమంత ..కాకపోతే !!
KathaSudha : జూన్ 21 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు సిద్దమైన ‘కథాసుధ – సండే స్టోరీస్’
Maa Inti Bangaram: ఓవర్సీస్ లో సమంత హవా.. ‘మా ఇంటి బంగారం’కు రికార్డు ప్రీ-సేల్స్
Maa Inti Bangaram Interview: ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్‌లో సమంత.. ప్రభాస్ గురించి ఏమన్నారంటే?
Thank You Subbarao Movie: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ ‘థాంక్యూ సుబ్బారావు’
Peddi 14 days collection: 320 కోట్లు దాటేసిన ‘పెద్ది’.. 14వ రోజు కలెక్షన్ల లెక్కలివే!