అమ్మ చేసిన పనికి మీనా ఓ గొప్ప పాఠం నేర్చుకుంది. ఓ కొత్త అనుభవం వచ్చింది.. అయినా సరే ఈ విషయాన్ని మాత్రం అంత తేలికగా వదిలి పెట్టను.. అమ్మకి గుణ పాఠం చెప్పే తీరుతాను అని బాలు అంటాడు.
మీకు మీనాని బాలు మేడ మీదకు తీసుకు వెళ్తాడు. ఇకపై ఇంట్లో నువ్వు వంటలు చేయొద్దు.. మనం స్ట్రైక్ చేయాల్సిందే.. అని బాలు అంటాడు. ఈ రోజు అమ్మ ఎంత మోసం చేసింది.. నువ్వు పనులు చేయకూడదు అని బాలు అంటాడు. మరీ చిన్న పిల్లాడిలా చేస్తున్నారు.. వాళ్లు అలా చేశారు కదా.. మనం అలా చేయలేం కదా అని అంటుంటుంది. నువ్వు ఇలానే అందరి మీద మంచితనం చూపిస్తే ఎలా అని బాలు అంటాడు. ఈ రోజు నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది.. చేసే వాళ్లున్నా.. చేయించే వాళ్లు ఉండాలి.. అదే నాయకత్వ లక్షణం.. అది నీకు ఉంది.. ఇదిగో ఇది నీ సంపాదన అని బాలు ఇస్తాడు. మరి నా వాట నాక ఇవ్వవా? నాకు కావాల్సింది ఇవ్వవా? అని ముద్దు ఇమ్మని ఇన్ డైరెక్ట్‌గా బాలు అడుగుతాడు. దీంతో మీనా మాట దాట వేస్తుంది. కింద పని ఉంది.. ముందు వెళ్దాం పదా అని అంటుంది. పనులు చేయొద్దు.. నాకు సేవలు చెయ్యి అని బాలు అంటాడు.బంధ్ ప్రకటించిన బాలు.. ఇక హాల్లో శ్రీ మహా విష్ణువులా బాలుకి మీనా సేవలు చేస్తుంటుంది. ఇంతలో ప్రభావతి, మనోజ్ వస్తారు. ఏంటి ఇదంతా మనోజ్‌కి ఆకలిగా ఉంది.. అన్నం పెట్టు అని ప్రభావతి అంటుంది. అతగాడికి పెళ్లి అయింది.. వాళ్ల ఆవిడను వచ్చి పెట్టుకోమనండని మీనా కౌంటర్లు వేస్తుంది. వంట గది మూసి వేయబడినది అని బోర్డ్ పెడతాడు బాలు. వంట లేదు.. ఆకలితోనే ఉండండి అని బాలు అంటాడు. ఇకపై నా భార్య వంట కూడా చేయదు.. స్ట్రైక్ చేస్తుంది.. అని బాలు అంటాడు. ఎప్పటి వరకు అని అడిగితే.. రెండు మూడేళ్లు అయితే చేయను అని మీనా అంటుంది.మీకు మాత్రం చేశా మామయ్య గారు.. కారణం తెలుసుకోవచ్చా? అని సత్య అడుగుతాడు. నువ్వే అని ప్రభావతి మీద కౌంటర్లు వేస్తాడు బాలు. ఇద్దరి కోడళ్లు వర్క్ చేస్తున్నారా? లేదు కదా.. మా ఆవిడ కూడా చేయదు అని బాలు అంటాడు. వాళ్లు ఇది ఒకటేనా? అని ప్రభావతి అంటుంది. ఎందుకు కాదు.. మీ ఎంగిళి కంచాలు కూడా కడుగుతాను.. నన్ను డెకరేషన్‌కి వెళ్లకుండా నాటకాలు ఆడారు.. నేను ఏ పనీ చేయడం లేదని నిందలు వేస్తారా? అని ప్రభావతిని కడిగి పారేస్తుంది మీనా. ఇక నుంచి నేను ఏ పని కూడా చేయను అని మీనా తెగేసి చెబుతుంది. మీకు మాత్రం చపాతీలు చేసి పెట్టాను తినేసి మందులు వేసుకోండి మామయ్య అని మీనా అంటుంది.వంట నేను చేస్తా.. ఇదే విషయం ముందే చెప్పాలి కదా అని రోహిణి అంటే.. నా ఇష్టం అని మీనా అంటుంది. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావే అని మీనాని ప్రభావతి అంటుంది. మీ అసలు రూపం తెలిశాక.. మీ మీద గౌరవమే పోయింది.. ఏం చేసుకుంటావో చేసుకో అని ప్రభావతి అంటుంది. ఇంట్లోంచి గెంటేస్తాను అని ప్రభావతి అంటుంది. నువ్వు ఎవరే గెంటేయడానికి అని సత్యం అంటాడు. అది చేయకపోతే ఏంటి.. నేను చేస్తాను.. నాకు రాదా వంటా అని రోహిణిని పిల్చుకుని ప్రభావతి కిచెన్‌లోకి వెళ్తుంది. ఇక రోహిణి ఆనియన్స్ కట్ చేయలేక ఇబ్బంది పడుతుంటుంది.డబ్బులు పారేస్తే.. గ్యాస్ ఉందా? లేదా? అన్నది కూడా గమనించకుండా అన్నీ రెడీ చేసుకుంటుంది. ఇంతలో శ్రుతిని హెల్ప్ అడుగుతుంది రోహిణి. మీ వంట మీరే చేసుకోండి మాక వద్దు అని శ్రుత అంటుంది. ఇక గ్యాస్ లేదని తెలిసి బాలుని అడుగుతుంది ప్రభావతి. ఆ గ్యాస్ మీనాది.. మీకు ఇవ్వం అని బాలు అంటాడు. కావాలంటే కట్టెల పొయ్యి మీద వంట చేసుకోండని బాలు అంటాడు. కోడల్ని అణగ దొక్కాలని చూసే అత్తకి కోడలు చెప్పే గుణపాఠం అని సత్యం కౌంటర్లు వేస్తాడు. ఇదంతా కావాలనే చేశావ్ కదా అని మనోజ్ అంటాడు. అవును.. అని మీనా అంటుంది. డబ్బులు పారేస్తే వస్తాయి.. మటన్ బిర్యానీ ఆర్డర్ పెడతాను అని రోహిణి అంటుంది.ఆకలితో అలమటించిన మనోజ్.. ఆర్డర్ పెట్టిన బిర్యానీ ఇంకా రాలేదని మనోజ్ కంగారు పడుతుంటాడు. రోహిణిని పదే పదే అడుగుతుంటాడు. వస్తుంది ఆగు అని మనోజ్ మీద రోహిణి ఫైర్ అవుతుంది. ఇక డోర్ వద్ద బాలు ఉండి.. ఆ మటన్ బిర్యానీ నువ్వు తినేసేయ్ అని డెలివరీ బాయ్‌కి చెప్తాడు. దీంతో అతను అటు నుంచి అటే పట్టుకెళ్తాడు. ఆర్డర్ ఇంకా రావడం లేదేంటి అని మనోజ్ కంగారు పడతాడు. మళ్లీ ఆర్డర్ పెడతాను ఆగు అని రోహిణి అంటుంది. ఫుడ్డు ఇంకా రాలేదా? నాకు ప్రాణం పోతోందని మనోజ్, ప్రభావతి అనుకుంటూ ఉంటారు. గేట్ వద్ద బాలు మాత్రం వాటిని రిటర్న్ చేసే కార్యక్రమంలో బిజీగా ఉంటాడు. వచ్చిన ప్రతీ ఆర్డర్‌ను రిటర్న్ పంపిస్తుంటాడు.వెనక్కి పంపించిన బాలు.. వచ్చిన ఆర్డర్లను బాలు వెనక్కి పంపించాడని మనోజ్ తెలుసుకుంటాడు. ఎందుకు రా ఇలా చేశావ్ అని మనోజ్ అంటే.. మీ అందరికీ గుణ పాఠం చెప్పాలని ఇలా చేశానని బాలు అంటాడు. మీనా వంట చేయకపోతే మీ పరిస్థితి ఏంటి? అన్నది మీకు తెలియాలి.. అందుకే ఇలా చేస్తున్నా.. కనీసం బిస్కెట్లు కూడా దొరకవు.. అని బాలు అంటాడు. ఈ పోరాటం ఆగదు.. సాగుతూనే ఉంటుంది.. మీనా అన్ని పనులు చేస్తుందని ఒప్పుకో.. అప్పుడు ఆపుతాం అని బాలు అంటాడు. అది జరగదు అంటే.. ఇది కూడా ఆగదు అని అంటాడు.ఉన్న వాటితోనే అదరగొట్టేసిన రవి.. మరో వైపు శ్రుతి, రవి ఆకలితో అలమటిస్తుంటారు. నువ్వు చెఫ్ కదా.. వంట చెయ్యి.. ఆర్డర్ పెడితే మన పరువు పోతుంది.. అని శ్రుతి అంటుంది. గ్యాస్ కూడా లేదు అని శ్రుతి అంటుంది. గ్యాస్ లేకపోయినా మనం వంట వండొచ్చు అని రవి అంటాడు. ఇక కిచెన్‌లోకి వెళ్లి ఉన్న వాటితోనే ఓ డిష్ ప్రిపేర్ చేస్తాడు. గ్యాస్ లేకపోయినా సరే.. రవి తన తెలివితో సాండ్ విచ్, మ్యాగీ ప్రిపేర్ చేసి ఇస్తాడు. దీంతో శ్రుతి చక్కగా తినేస్తుంది. రవి గాడు తన పాక శాస్త్రంతో అదరగొట్టేస్తున్నాడే అని మనోజ్ అనుకుంటాడు. మాక్కూడా పెట్టమని అడుగురా అని ప్రభావతి అంటుంది. డబ్బులిస్తా మాక్కూడా చేసి పెట్టు అని మనోజ్ అంటే.. గరిటతో కొడతా అని రవి ఫైర్ అవుతాడు.ఆడుకున్న బాలు.. నువ్వు మామూలుగా అడిగి ఉంటే.. ఇచ్చేవాడ్ని.. నాకు ఆర్డర్ వేశావ్.. అస్సలు ఇవ్వను.. అని మనోజ్‌తో రవి అంటాడు. కనీసం నాకు అయినా పెట్టు రా అని ప్రభావతి అడుగుతుంది. ముందే నువ్వు అడిగితే ఇచ్చేవాడ్ని... కానీ నువ్వు మనోజ్ గాడ్ని పంపించావ్.. నేను ఇవ్వను అని అంటాడు రవి. అద్భుతంగా చేశావ్ అని రవి రెసిపీలను శ్రుతి పొగుడుతుంది. వీడేమో వాసనలతోనే చంపుతున్నాడు.. అని ప్రభావతి అనుకుంటుంది. బయటకు వెళ్లి తీసుకు రా.. అని మనోజ్‌కి రోహిణి చెబుతుంది. దీంతో బాలు ఆ కారు టైర్‌లోని గాలి పీకేస్తాడు. క్యాబ్ కావాలా? నిమిషానికి ఐదు వేలు అని డిమాండ్ చేస్తాడు బాలు.Screenshot 2026-06-19 071434