
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఎన్డీయే మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ విజయం రాంచీ; దిల్లీ: మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ సమయంలోనే మీనాక్షి నటరాజన్ విషయంలో దెబ్బతిన్న కాంగ్రెస్పార్టీకి ఝార్ఖండ్లో మరో షాక్ తగిలింది. గురువారం రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.
రాష్ట్రంలోని రెండు రాజ్యసభ స్థానాలకు పోరు జరిగింది. ఎన్డీయే మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ 28 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా (20ఓట్లు)ను ఓడించారు. మరో స్థానాన్ని అధికార ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎమ్ఎమ్) అభ్యర్థి బైద్యనాథ్ రామ్ 30 ఓట్లతో కైవసం చేసుకున్నారు.
81 మంది సభ్యులున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో రాజ్యసభ సీటు గెలవడానికి కనీసం 28 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. అయితే భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి కేవలం 24 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది. విజేతగా నిలవడానికి ఎన్డీయేకు మరో 4 ఓట్లు తక్కువైనప్పటికీ, ఇండియా కూటమిలో జరిగిన క్రాస్ ఓటింగ్ కారణంగా పరిమళ్ నత్వానీ విజయం సాధించడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.