
ఇంటర్నెట్ డెస్క్: జెరోదా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ (Nithin Kamath) నెట్టింట చర్చనీయాంశం అయ్యారు. ఓ ఉద్యోగి కోసం ఆయన చేసిన ప్రయత్నం అలాంటిది మరి! ఏడాదిలో 30 కిలోల బరువు తగ్గితే రూ.2.
5 లక్షలు ఇస్తానని ఆయన ఉద్యోగితో ఫిట్నెస్ బెట్ కట్టారు. అనుకున్నట్టే ఆ ఉద్యోగి బరువు తగ్గి బెట్లో విన్ అయ్యాడు. దీంతో డబ్బులు పోయినా తనకు ఆనందంగానే ఉందంటూ సోషల్ మీడియాలో కామత్ పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. జీవితాన్ని గెలిచావంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిదంటే..
నితిన్ కామత్ తన కంపెనీలోని రోహిత్ అగర్వాల్‌తో గతేడాది ఫిట్నెస్ బెట్ కట్టారు. 30 కిలోల బరువు తగ్గితే రూ.2.5 లక్షలు చెల్లిస్తానని మాట ఇచ్చారు. అనుకున్నట్టే అగర్వాల్ ఈ బెట్లో విజయం సాధించారు. దీంతో ఫిట్నెస్ బెట్లో ఓడిపోయినా, ఉద్యోగి బరువు తగ్గడం పట్ల కామత్ హర్షం వ్యక్తం చేశారు. ఓడినా.. ఆనందంగా ఉందంటూ సదరు ఉద్యోగిని ట్యాగ్ చేస్తూ పోస్టు చేశారు. దీనిపై రోహిత్ అగర్వాల్ స్పందిస్తూ.. ‘గతేడాదిలో 30 కిలోల బరువు తగ్గాను. ఇందుకోసం ఎంతో కష్టపడ్డాను. డబ్బు కంటే ఫిట్నెస్ కాపాడుకోవడం ఆనందంగా ఉంది. ఇదే అన్నింటికంటే విలువైంది. బాస్ వల్లే ఇది సాధ్యమైంది’ అని అగర్వాల్ పేర్కొన్నారు. 104 కిలోల నుంచి 75 కిలోలకు తగ్గానని తెలిపారు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు కామత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. బెట్ ఓడినా జీవితం గెలిచారంటూ కామత్‌ను ప్రశంసించగా.. 30 కిలోలు బరువు తగ్గడమే అసలైన విక్టరీ అంటూ మరికొందరు కంగ్రాట్స్ చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కృత్రిమ మేధతో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనల మధ్య అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సరికొత్త విశ్లేషణ చేశారు.