
Collector K Haritha: ఆసిఫాబాద్, మే 30: బాలికలు, మహిళలు తమ హక్కులు మరియు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళ వారోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (DRDO) దత్తారావు, జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) సీతారాం, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధి ప్రమీలలతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, బాలికల రక్షణ మరియు హక్కుల కోసం అనేక చట్టాలను తీసుకువచ్చాయని గుర్తు చేశారు. సమాజంలో మహిళలు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, అందుకు అధికారులు నిరంతరం కృషి చేయాలని ఆదేశించారు.
మహిళలు, బాలికలు చట్టాలను గౌరవించడంతో పాటు, సమాజంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు తాము చదువుకునే పాఠశాలలను దేవాలయాలుగా భావించి ఉన్నత లక్ష్యాల వైపు సాగాలన్నారు.
Collector K Haritha: ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘ఉల్లాస’ (పుల్లాస్) కార్యక్రమంలో ఒక అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. సిర్పూర్ (యు) మండల కేంద్రానికి చెందిన 74 ఏళ్ల వృద్ధురాలు మెస్రం జిజాబాయి ఈ వయసులోనూ ఉల్లాస పరీక్ష వ్రాసి ఘనంగా ఉత్తీర్ణత సాధించారు.
చదువుకు వయసుతో
నిమిత్తం లేదని నిరూపించిన జిజాబాయిని కలెక్టర్ కె. హరిత ప్రత్యేకంగా శాలువాతో సన్మానించి, సర్టిఫికేట్ అందించి అభినందించారు. అనంతరం మాక్ పార్లమెంట్ ప్రదర్శన ద్వారా మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Terror Module : దేశాన్ని వణికించే కుట్ర భగ్నం.. 9 మంది అరెస్ట్
India Cricket Team : ఆసియా గేమ్స్ జాబితాలో వైభవ్.. స్టార్లకు షాక్?
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Mahila Shakti Super Markets: మహిళా శక్తి సూపర్ మార్కెట్లు: యెన్నం!
Komuravelli house burglary:కొమురవెల్లిలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ!
Mahalaxmi Smart Card Telangana:మహాలక్ష్మి కార్డు ఫేక్:ప్రభుత్వం!
Bandaru Dattatreya:బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ!
Addanki Dayakar: బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలో బాల్క సుమన్ బలిపశువు: అద్దంకి దయాకర్
Balmoori Venkat: బాల్క సుమన్‌పై పీడీ యాక్ట్ పెట్టాలి.. ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ సంచలన డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జిందాల్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ (చెత్త...
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించేందుకు నిర్వహించిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో...
బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న పొలిటికల్ డ్రామాలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కేవలం...
2026లో జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఆసియా...
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయి తదితర ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున దాడులు, పేలుళ్లు...
నస్పూర్, మే 30: రాజకీయాలు సమాజం, దేశ శ్రేయస్సు కోసం మాత్రమే చేయాలని, వ్యక్తిగత అవసరాలకు,...
ఆసిఫాబాద్, మే 30: బాలికలు, మహిళలు తమ హక్కులు మరియు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి...
పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లా, సోనార్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన...
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన డీఎస్సీ (AP DSC) ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై వస్తున్న అన్ని రకాల...
విజయనగరం, మే 30: అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు ఉండే గదులు ఇంత...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.