
నీట్-యూజీ (NEET-UG) 2026 రీ-ఎగ్జామ్కు ముందు టెలీగ్రామ్ పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది.
అయితే, ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్రం తన నిర్ణయాన్ని సమర్ధించింది. అంతేకాక.. టెలీగ్రామ్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్ కొత్త డార్క్ వెబ్గా మారి.. ముప్పు కలిగించే వర్గాలను ఒకచోటకు చేర్చుతోందని, నేరగాళ్లు టెలిగ్రామ్ ఛానళ్లలో డీప్ వెబ్ లింకులను పంచుతూ, డార్క్ వెబ్ ఫోరమ్ లకు అనుసంధానం చేస్తున్నారని కేంద్రం తన అఫిడవిట్ లో పేర్కొంది.
దీని వల్ల నేరగాళ్లను గుర్తించడం, వారి ఆచూకీ కనుగొనడం అధికారులకు కష్టమవుతోందని తెలిపింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, తీవ్రవాదం, ఉగ్రవాదం, పిల్లల దోపిడీ, సైబర్ మోసాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ వినియోగం పెరుగుతోందని, దీనికి ప్రధాన కారణం గోప్యత సౌకర్యాలేనని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది.
ఈ మాధ్యమంలో పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్లు, కాపీరైట్ కంటెంట్ కూడా ప్రసారమవుతున్న విషయాన్ని కేంద్రం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇండియాలో టెలిగ్రామ్ బంద్? తీవ్రవాద సంస్థలకు చెందిన ప్రచార సామగ్రి, హింసను ప్రోత్సహించే విషయాల ప్రసారానికి కూడా టెలిగ్రామ్ గ్రూపులు, ఛానళ్లు వినియోగంలో ఉన్నాయని కేంద్రం ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది.
ఈ క్రమంలో ఇండియాలో టెలిగ్రామ్ బంద్ చేసేందుకు కేంద్రం చర్యలకు సిద్ధమైందన్న చర్చ జరుగుతుంది. నీట్ ఎగ్జామ్ ముగిసే వరకు అంటే.. ఈనెల 22వ తేదీ వరకు టెలీగ్రామ్పై ఆంక్షలు అమల్లో ఉంటాయని కేంద్రం పేర్కొంది. అయితే, టెలీగ్రామ్ ద్వారా దేశానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న భావనను తెలియజేసిన కేంద్రం..
కొందరు వాదిస్తున్నారు. ఒకవేళ ఆంక్షల తరువాత అంటే.. 22 తర్వాత అయినా మళ్లీ అనుమతిస్తే సమస్యలు రావా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో టెలీగ్రామ్ ను భారత్ లో పూర్తిస్థాయిలో బంద్ చేసే దిశగా కేంద్రం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇన్ని సమస్యలు ఉంటే అసలు అనుమతులు ఎలా ఇస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదేజరిగితే కేంద్రానికి శాంతిభద్రతల సమస్య కాదా అని