
Severe Drought India : భారతదేశంలో రాబోయే రోజుల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందంటూ వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే దేశ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్న ‘ఎల్‌నినో’ (సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం) రానున్న శీతాకాలం (వింటర్) నాటికి మరింత ప్రమాదకరంగా మారి, ‘సూపర్ ఎల్‌నినో’గా రూపాంతరం చెందే అవకాశం 63 శాతం వరకు ఉందని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) స్పష్టం చేసింది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరగడాన్ని ‘సూపర్ ఎల్‌నినో’గా పరిగణిస్తారు. ఈ అసాధారణ మార్పుల వల్ల సముద్ర ప్రవాహాలు, గాలి దిశలు మారిపోయి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత ఉపఖండంలో వాతావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది.
Read Also : ఆధునిక రాజకీయంలో ‘ప్రసవ’ ప్రహసనం
ఈ సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల భారతదేశానికి జీవనాధారమైన నైరుతి రుతుపవనాలతో పాటు, శీతాకాలంలో కురిసే ఈశాన్య రుతుపవనాలు కూడా పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో సాధారణం కంటే చాలా తక్కువగా వర్షపాతం నమోదవడం వల్ల తీవ్రమైన తాగునీటి ఎద్దడి, సాగునీటి కొరత ఏర్పడి దేశవ్యాప్తంగా కరవు పరిస్థితులకు దారితీయవచ్చు. వర్షాలపైనే ఆధారపడి సాగయ్యే ఖరీఫ్, రబీ పంటల దిగుబడి ఘోరంగా పడిపోయి, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది కేవలం రైతాంగాన్ని మాత్రమే కాకుండా, ఆహార ధాన్యాల కొరతకు దారితీసి దేశ ఆర్థిక వ్యవస్థను, నిత్యావసరాల ధరలను సైతం భారీగా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Telangana Road Accident: తెలంగాణలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు..కేంద్ర నివేదిక వెల్లడి
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
UPIతో పీఎఫ్ విత్ డ్రా.. ఎప్పటి నుండి అంటే !!
Neet Student Suicide : మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. !!
NEET UG 2026 Re-exam: నీట్ రీ-టెస్ట్‌పై అపోహలు వద్దు.. విద్యార్థులకు ఎన్టీయే సూచన
Mamata Banerjee : మమతా బెనర్జీకి కోల్‌కతా హైకోర్టులో బిగ్ షాక్
Childbirth : ఆధునిక రాజకీయంలో ‘ప్రసవ’ ప్రహసనం