మనుషులు పలికే మాటలను మేకలు అర్థం చేసుకోగలవని, కేవలం గొంతు వినిపించిన దిశను బట్టి దాచిపెట్టిన ఆహారాన్ని గుర్తించగలవని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
జ్యూరిచ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేపట్టిన ఈ పరిశోధన వివరాలు 'రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మేకల సామాజిక ప్రవర్తన, వాటి తెలివితేటలకు సంబంధించి ఈ అధ్యయనం కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది.ఈ ప్రయోగంలో భాగంగా పరిశోధకులు మొత్తం 29 మేకలపై పరీక్షలు నిర్వహించారు. రెండు ఒకేరకమైన బకెట్లను ఉంచి, ఒకదానిలో మేకలకు ఇష్టమైన పాస్తాను దాచిపెట్టారు. అనంతరం ఆహారం ఉన్న బకెట్ వైపు చూస్తూ ఒక వ్యక్తి ఉత్సాహంగా మాట్లాడారు. ఆ గొంతు వినిపించిన దిశను అనుసరించి మేకలు దాదాపు 60 శాతం సందర్భాల్లో సరైన బకెట్‌ను గుర్తించడం విశేషం.అయితే, సదరు వ్యక్తి మౌనంగా ఉన్నప్పుడు లేదా ఏ బకెట్ వైపు చూడకుండా మాట్లాడినప్పుడు మేకలు కేవలం 47 నుంచి 49 శాతం మాత్రమే సరైన బకెట్‌ను గుర్తించగలిగాయి. దీనిని బట్టి అవి కేవలం గొంతు వినిపించే దిశను ఆధారంగా చేసుకుని ఆహారాన్ని కనిపెట్టాయని స్పష్టమవుతోంది. ఇటువంటి పరీక్షల్లో కుక్కలు కూడా దాదాపు 63 శాతం విజయం సాధిస్తాయని, ఈ విషయంలో మేకల సామర్థ్యం కుక్కలతో సమానంగా ఉందని పరిశోధకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.మానవులతో సుదీర్ఘ కాలం కలిసి జీవించడం, పెంపకం వంటి కారణాల వల్లే మేకలకు ఈ నైపుణ్యం వచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చింపాంజీల వంటి జంతువుల్లో సైతం ఈ తరహా లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. "జంతువులు