
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక-Aతో మ్యాచ్ సందర్భంగా లంక ఆటగాడు హలంబాగే, వైభవ్ సూర్యవంశీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. మైదానంలో దూకుడుగా ప్రవర్తించినందుకు వైభవ్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందని వార్తలొస్తుండటంపై బోర్డు కార్యదర్శి దేవ్జిత్ సైకియా (Devajit Saikia) స్పందించారు.
తాము ఈ విషయంలో జోక్యం చేసుకోమని.. అది మ్యాచ్ రిఫరీ పరిధిలోని అంశమని సైకియా స్పష్టం చేశారు. జరిమానా విధించడం లేదా ఇంకా ఏవైనా చర్యలు తీసుకోవడం వంటి నిర్ణయాలన్నీ మ్యాచ్ రిఫరీ చూసుకుంటారని పేర్కొన్నారు. ‘‘సోషల్ మీడియాలో అనేక అంశాలపై చర్చ జరుగుతోంది.
వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)పై బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు వస్తున్నాయి. కానీ, మ్యాచ్ రిఫరీ పరిధిలోకి బీసీసీఐ జోక్యం చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారా? ఇలాంటి విషయాల్లో బీసీసీఐకి నిర్ణయాధికారం ఉండదు.
మైదానంలో జరిగే సంఘటనలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రధానంగా మ్యాచ్ రిఫరీ, అంపైర్లకు ఉంటుంది. బీసీసీఐ నిబంధనలు, ఐసీసీ నియమావళి ప్రకారం ఇటువంటి విషయాలలో బోర్డుకు ఎటువంటి పాత్ర ఉండదు. దీనికి సంబంధించిన బాధ్యత మ్యాచ్ రిఫరీదే.
ఏదైనా సమస్య తలెత్తితే మ్యాచ్ రిఫరీ, అంపైర్లు నిర్ణయం తీసుకుంటారు. దీని కోసం ఇప్పటికే ఒక వ్యవస్థ అమలులో ఉంది. ఈ అంశంపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కానీ అవన్నీ నిరాధారమైనవి. ఈ విషయంలో బీసీసీఐ అస్సలు జోక్యం చేసుకోదని నేను మీకు హామీ ఇస్తున్నాను’’ అని సైకియా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
ఈ నెలాఖరులో టీమ్ఇండియా.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనకు వైభవ్ ఎంపికయ్యాడు. సూర్యవంశీ చిన్నవాడు కావడంతో టూర్‌కు అతని తల్లిదండ్రులను కూడా వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించింది. ఈ నేపథ్యంలో వైభవ్ గురించి సైకియా మాట్లాడారు.
వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాడు దొరికాడు. ఒకప్పుడు సచిన్ తెందూల్కర్ 16ఏళ్లకే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. అంత చిన్న వయసున్న ఆటగాడు సీనియర్ జట్టులో ఉన్నప్పుడు సహజంగానే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వైభవ్ సీనియర్ జట్టు వాతావరణానికి అలవాటు పడటానికి ఇండియా-A ముక్కోణపు సిరీస్‌కు ఎంపిక చేశాం. సూర్యవంశీ ఇంకా చిన్న పిల్లాడు. అందుకే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్‌కు అతని తల్లిదండ్రులు వెళ్లేందుకు అనుమతించాం. వైభవ్ ఇప్పుడే కాదు రాబోయే రెండు, మూడు దశాబ్దాలపాటు భారత క్రికెట్‌కు ఆస్తిగా నిలిచే వ్యక్తి’’ అని బీసీసీఐ కార్యదర్శి పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
‘‘సీనియర్ స్థాయిలోని అన్ని జాతీయ జట్ల జట్టులోనూ 14 లేదా 15 ఏళ్ల వయసున్న ఆటగాళ్లు ఉండరు. ఎన్నో దశాబ్దాల తర్వాత మనకు