
అసలైన కుంకుమ ఎప్పుడూ ప్రకాశవంతమైన ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటుంది. అదే నకిలీ కుంకుమ అయితే, దాని రంగు చాలా వెలిసిపోయినట్టు కనిపిస్తుంది. నిజమైన కుంకుమ వాసన ప్రత్యేకంగా ఉంటుంది. అదే నకిలీ కుంకుమ అయితే, దాని వాసన ఘాటుగా లేదా కృత్రిమంగా, కెమికల్స్ వాసనలా వస్తుంది.
అసలైన కుంకుమ రుచి కొద్దిగా పుల్లగా, చేదుగా ఉంటుంది. కానీ నకిలీ కుంకుమ మాత్రం తీపిగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో రసాయనాలు కలుపుతారు. కొద్దిగా కుంకుమను నీటిలో వేసి కలపండి. అసలైన కుంకుమ అయితే నెమ్మదిగా కరిగి నీరు లేత గులాబీ రంగులోకి మారుతుంది.
అదే నకిలీది అయితే, వెంటనే కరిగిపోయి నీటి రంగు డల్‌గా అయిపోతుంది. అసలైన కుంకుమ ఎప్పుడూ మెరుస్తూ ఉండదు. అది కాస్త డల్‌గా, మ్యాట్ ఫినిషింగ్‌లో కనిపిస్తుంది. మరీ ఎక్కువగా మెరుస్తుందంటే అందులో రసాయనాలు కలిపినట్లే. కుంకుమను చేతిలోకి తీసుకుని రుద్ది చూడండి.
అది చేతికి అంటుకోకుండా, సులభంగా రాలిపోతే అది అసలైనది. అదే చేతికి అంటుకుపోయిందంటే అది నకిలీదని అర్థం. నకిలీ కుంకుమ వాడితే చర్మానికి ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనివల్ల మొటిమలు, దురద వంటి సమస్యలు ఎదురవుతాయి. Silver Bracelets: అమ్మాయిల కోసం అందమైన కడా స్టైల్ వెండి బ్రేస్లెట్స్ Gold Jhumki: ఈ గోల్డ్ జుంకాల డిజైన్లు చూస్తే కొనకుండా ఉండలేరు Short Kurti: కాలేజీ అమ్మాయిల కోసం క్లాసీ లుక్ ఇచ్చే షార్ట్ కుర్తీలు ZZ Plant: బెడ్రూమ్లో ఈ ఒక్క మొక్క ఉన్నా చాలు..
ఎన్నో లాభాలు!