
ఒక కప్పు పల్లీలు, 2-3 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం, జీలకర్ర, ఉప్పు, నూనె, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి. ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేసి పల్లీలను దోరగా వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కాస్త బరకగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, నిమ్మరసం, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత పల్లీల పొడిని కూడా వేసి కలపాలి. ఇక పోపు కోసం... నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి వేయించాలి.
రెడీ అయిన ఈ పోపును చట్నీలో కలపాలి. అంతే, హోటల్ స్టైల్ పల్లి చట్నీ రెడీ. వేడివేడి ఇడ్లీ, దోశలతో సర్వ్ చేస్తే అదుర్స్. Coriander: కొత్తమీర ఇలా పెడితే నెలరోజులైనా తాజాగా ఉంటుంది Litchi Benefits: ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు Onion: రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా?
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?