
జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం ద్వారా వారి గతం, వర్తమానం, భవిష్యత్ గురించి తెలుసుకోవచ్చు. జులైలో కొన్ని అక్షరాలతో పేరు మొదలయ్యే వారికి కెరీర్, డబ్బు, ప్రేమ, కుటుంబ జీవితంలో శుభవార్తలు అందనున్నాయి.
మరి ఆ అదృష్టవంతులు ఎవరో చూద్దామా.. 'A' అక్షరంతో పేరు మొదలయ్యే వారికి జులైలో అభివృద్ధి, విజయానికి కొత్త అవకాశాలు వస్తాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్‌తో పాటు మంచి స్థాయిలో జీతం పెరిగే అవకాశం ఉంది.
వ్యాపారంలో లాభాలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 'M' అక్షరంతో పేరు మొదలయ్యే వారు జులైలో పెద్ద విజయాన్ని అందుకుంటారు. పోటీ పరీక్షల ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. భార్యాభర్తల సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది.
కోర్టు కేసులకు సంబంధించి విజయం దక్కే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. 'S' అక్షరంతో పేరు మొదలయ్యే వారికి కూడా జులై నెల ఎన్నో సంతోషాలను తెస్తుంది. మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు.
ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి శుభవార్త అందుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు ఊహించని విధంగా రాణిస్తాయి. మీ సంతోషం రెట్టింపవుతుంది. 'R' అక్షరంతో పేరు మొదలయ్యే వారు జులై నెలలో కష్టాల నుంచి గట్టెక్కుతారు.
ఉద్యోగాలలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. పై అధికారులు మీ పనితీరుతో సంతోషిస్తారు. ఒక ముఖ్యమైన వ్యక్తితో పరిచయం భవిష్యత్తులో మీకు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలపడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
.
వ్యాపారాలలో ఊహించని ధనలాభం కలుగుతుంది