
టెలిగ్రామ్ ఒక సరికొత్త 'డార్క్ వెబ్'లా రూపాంతరం చెందిందని, నేరస్థులు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు చట్టం నుంచి తప్పించుకోవడానికి దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
లీకైన పరీక్ష పత్రాలు - ప్రశ్నార్థకమైన భవిష్యత్తు: NEET వంటి ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, పంపిణీకి టెలిగ్రామ్ ఛానళ్లు వేదికగా మారాయని ప్రభుత్వం పేర్కొంది. ఇది దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని తెలిపింది.
సైబర్ నేరాలు, డేటా లీకులు: నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం, టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న సైబర్ మోసాలపై ఫిర్యాదులు భారీగా పెరిగాయి. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు దొంగిలించిన డేటాను విక్రయించడానికి, మనీ లాండరింగ్ కోసం 'మ్యూల్ బ్యాంక్ ఖాతాల'ను కొనుగోలు చేయడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌ను వాడుతున్నారు.
చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్ (CSEAM): టెలిగ్రామ్‌లో అత్యంత ఆందోళనకరమైన అంశం చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (Child Sexual Exploitative and Abuse Material) వ్యాప్తి చెందుతోందని కేంద్రం తెలిపింది. భద్రతా సంస్థలకు ఇది పెద్ద సవాలుగా మారిందని పేర్కొంది.
తీవ్రవాద ప్రచారం - శాంతిభద్రతలకు విఘాతం: ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద గ్రూపులు తమ భావజాలాన్ని ప్రచారం చేయడానికి, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా పౌర సమాజంలో అశాంతిని రేకెత్తించడానికి టెలిగ్రామ్ గ్రూపులను వాడుకుంటున్నాయని చెప్పింది. మాల్వేర్, కమాండ్ అండ్ కంట్రోల్ హబ్: కొన్ని ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్లు బాధితుల డేటాను దొంగిలించడానికి టెలిగ్రామ్‌ను కమాండ్-అండ్-కంట్రల్ ప్లాట్ ఫామ్‌గా వాడుకుంటున్నాయి.
కార్డుల వివరాలు, సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసేలా టెలిగ్రామ్ బోట్లు (Bots) పనిచేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
పైరసీ రంగస్థలం: కేవలం సైబర్ నేరాలే కాకుండా, కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కాపీరైట్ ఉన్న కంటెంట్‌ను అనధికారికంగా పంపిణీ చేయడం ద్వారా కంటెంట్ క్రియేటర్లకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోందని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది.
టెలిగ్రామ్‌లో ఉన్న మితిమీరిన ప్రైవసీ, అనామక ఫీచర్లు నేరగాళ్లకు రక్షణ కవచాలుగా మారాయని కేంద్రం అఫిడవిట్లో వివరించింది. వినియోగదారులు తమ ఫోన్ నంబర్లు, టెలిగ్రామ్ ఐడీలను దాచుకునే సదుపాయం ఉండటం వల్ల, నేరాల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించడం పరిశోధనా సంస్థలకు అత్యంత క్లిష్టంగా మారుతోందని ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది.
డీఎంకేకు మరో షాక్.! టీవీకే వైపు ఎండీఎంకే.?
బీబీ ఒకసారి ఆలోచించండి.. మీకు కావాల్సినదే దక్కింది: ట్రంప్
గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను బైపాస్ చేసే టూల్స్, నకిలీ ఆర్థిక యాప్‌ల రూపంలో ఉండే మాల్వేర్లను ఇక్కడ బహిరంగంగానే ప్రకటిస్తున్నారని కేంద్రం కోర్టుకు చెప్పింది. వ్యక్తిగత డేటా విక్రయించే బోట్లు: గతంలో లీకైన డేటాబేస్‌ల ఆధారంగా పౌరుల మొబైల్ నంబర్లు, ఇతర ప్రభుత్వ గుర్తింపు