
ఉదయం నష్టాలలో కదలాడినప్పటికీ వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం మదుపర్ల నమ్మకాన్ని పెంచింది. ఉదయం నష్టాలలో కదలాడినప్పటికీ వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి.
పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం మదుపర్ల నమ్మకాన్ని పెంచింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 78.23 డాలర్లకు తగ్గింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.33) బలపడడం దేశీయ సూచీలకు సానుకూలంగా మారింది.
ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నాలుగో రోజు కూడా లాభాలతో ముగిశాయి (Indian stock market). గత సెషన్ ముగింపు (77,155)తో పోల్చుకుంటే గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు ఒడిదుడుకులు ఎదుర్కొంది.
అయితే చివర్లో కొనుగోళ్లు జరగడంతో లాభాల్లోకి వచ్చింది. చివరకు 254 పాయింట్ల లాభంతో 77,409 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 82 పాయింట్ల లాభంతో 24,168 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో మ్యాక్స్ హెల్త్‌కేర్, నైకా, అదానీ పవర్, సీడీఎస్ఎల్, కేన్స్ టెక్నాలజీస్ మొదలైన షేర్లు లాభాలను ఆర్జించాయి (share market news). ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఎన్బీసీసీ, పేటీఎం, వరుణ్ బేవరేజెస్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.
బ్యాంక్ నిఫ్టీ 378 పాయింట్ల లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 255 పాయింట్లు ఆర్జించింది. మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ
..