
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Eldest Son or Daughter should not get married in this Jyeshta maas: సాధారణంగా పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయిన గొప్ప మార్పు. అందుకే పెద్దలు పెళ్లి చేసేటప్పుడు చాలా విషయాలు జాగ్రత్తగా గమనిస్తారు. అటు ఏడు తరాలు, ఇటు ఏడుతరాలు చూడాలంటారు.
అంతే కాకుండా జాతకాలు, నాడీ దోషాలు, యువతీ, యువకుల మధ్య గుణాలు మొదలైనవి జాగ్రత్తగా చూస్తారు. చాలా మంది వీటిలో ఏ ఒక్కకి కుదరకున్న పెళ్లి విషయంలో ముందుకు పోరు. అయితే జ్యేష్ఠ మాసంలో ఇంట్లో పెద్ద కూతురు లేదా కొడుకు పెళ్లి విషయంలో అనాదీగా కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు.
జ్యేష్ఠ మాసంలో ఒక ఇంటి పెద్ద కుమారుడు, మరో ఇంటి పెద్ద కూతురుకి ఇచ్చి పెళ్లి చేయడం నిషేధం అని పండితులు చెబుతారు. దీన్ని త్రి జ్యేష్ఠదోషం అంటారు. ఇలా పెళ్లి చేస్తే సంసార జీవితంలో లేని చిక్కులు వస్తాయంటారు. అంతే కాకుండా జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ సంతానం, జ్యేష్ఠ నక్షత్రం ఉన్న కూడా పెళ్లిళ్లు చేయరు.
ఒక వేళ ఇంట్లో జ్యేష్ఠ సంతానం మరో ఇంటి అబ్బాయి లేదా అమ్మాయి రెండో లేదా మూడో సంతానం అయితే ఆ పెళ్లిళ్లు చేయోచ్చు. కానీ దోష పరిహరాల పూజలు చేయాలంటారు. దీనితో పెళ్లి తర్వాత సమస్యలు రావని చెప్తారు. ఇక ఎట్టిపరిస్థితుల్లో త్రిజ్యేష్ఠ దోషాలు లేకుండా పెళ్లిళ్లు ప్లాన్ చేసుకొవాలని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి భవిష్యత్తులో సంసారం జీవితంలో లేని చిక్కులకు కారణమౌతాయని పండితులు
సూచిస్తారు. అందుకు జ్యేష్ఠ మాసంలో పెళ్లిళ్లు చేసుకొవాలని ప్లాన్ లో ఉన్న వారు ఈ విషయాల్ని గమనించుకొని తమ పెళ్లిళ్లు చేసుకొవాలని పండితులు చెబుతున్నారు. మరోవైపు నిజ జ్యేష్ఠ మాసం జూన్ 16 నుండి ప్రారంభమై జూలై 14 వరకు కొనసాగుతుంది.
ఈ మాసంలో జూన్ 19, 21, 22, 24, 25, 29, 30 తేదీలలో వివాహాలకు అత్యంత అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు చేసుకొవాలనుకునే జంటలు ఆయా తేదీల్లో తమకు గురుబలం ఉందా ..?.. అన్నిరకాలుగా ఆ తేదీలు దివ్యంగా ఉందా..?. అన్న విషయాల్ని మీమీ ఆస్థాన పండితులకు అడిగి ముందుకు వెళ్లాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Read more: Guru Pushya Yog: గురుపుష్యమి వేళ మహా అద్భుతం.. రేపటి నుంచి కుబేరులు కానున్న రాశులు ఇవే.. మీరున్నారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.