
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Tecno Pova 8 5g Launched In India News: భారత స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో (Tecno) సంస్థ అదిరిపోయే శుభవార్తను అందించింది.
అద్బుతమైన ఫీచర్స్‌తో గత వారం విడుదలైన Tecno Pova 8 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన విక్రయాలు జూన్ 18న ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారత్‌లో అందుబాటులో ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీ, అద్భుతమైన డిజైన్‌తో కూడిన ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో పాటు ఇతర ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది.
అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ భాతర మార్కెట్లో రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి స్టోరేజ్ వేరియంట్ 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ ఆప్షన్లో ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది.
ఇక రెండవ వేరియంట్ 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌తో ధర రూ.31,999తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ సిల్వర్ వైట్‌తో పాటు ఆరెంజ్, గ్రీన్ రంగులలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.. మెగా 8000mAh బ్యాటరీ.. ఈ టెక్నో పోవా 8 5G స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద హైలైట్ దీనిలోని శక్తివంతమైన 8,000mAh భారీ బ్యాటరీ..
దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.. దీనిని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే.. దాదాపు 1,198 గంటల స్టాండ్‌బై టైమ్‌తో
పాటు 17 గంటలకు పైగా వీడియో ప్లేబ్యాక్‌ను ఇది అందిస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తూ వస్తోంది.
అద్భుతమైన డిస్ప్లే... టెక్నో పోవా 8 5G స్మార్ట్‌ఫోన్‌లో ప్రీమియం 6.76 అంగుళాల పూర్తి HD+ IPS డిస్ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.. గేమింగ్‌తో పాటు స్క్రోలింగ్ సున్నితంగా ఉండేందుకు ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా అందించారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 950 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ కూడా లభిస్తోంది. ఫోన్ వెనుక భాగంలో నోటిఫికేషన్లు, లైటింగ్ కోసం ప్రత్యేకమైన అలైవ్ మ్యాట్రిక్స్ (Alive Matrix) డిస్ప్లేను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది..
శక్తివంతమైన ప్రాసెసర్‌తో పాటు కెమెరా.. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7100 (MediaTek Dimensity 7100) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 పై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లోకి కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక భాగంలో ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ Sony LYT-600 ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇక ముందు భాగంలో సెల్ఫీల కోసం.. చాలా ప్రత్యేకమైన 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.. అదేవిధంగా ఏఐ క్యామ్, పోర్ట్రెయిట్, సూపర్ నైట్ మోడ్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.