
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
NTA Shares Marking Scheme For NEET UG 2026 Re-Exam: రీనీట్ పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ అలెర్ట్.. దేశవ్యాప్తంగా 2026 జూన్ 21 ఆదివారం నీట్ పునః పరీక్ష జరుగుతున్న సంగతి తెలిసందే. అయితే, ఎన్టీఏ ఈ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం గైడ్‌లైన్స్ విడుదల చేసింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే, ఈ పరీక్షల్లో ఎలా మార్కింగ్ చేయాలని పరీక్ష రాసేవారికి కొన్ని గైడ్‌లైన్స్ కూడా విడుదల చేసింది. ఈ క్వశ్చన్ పేపర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీకి సంబంధించిన ప్రశ్నాపత్రం.
ఈ గైడ్‌లైన్స్ ఎక్స్ వేధికగా షేర్ చేసింది ఎన్టీఏ.. రీనీట్ ప్రశ్నాపత్రంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ సబ్జెక్టులకు సమతుల్యమైన ప్రాధాన్యత ఇచ్చారు. అభ్యర్థులు ఈ ప్రశ్నలను ఎంతో క్లారిటీగా, కాన్ఫిడెన్స్‌తో రాయడానికి సహాయపడతాయి 'వన్ ఎగ్జామినేషన్..
వన్ ఫెయిర్ ఫీల్డ్' అని హెడ్డింతో తన ఎక్స్ హ్యాండిల్లో ఎన్టీఏ పేర్కొంది. రీనీట్ ప్రశ్నాపత్రం 2026.. రీనీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం 2026 మొత్తం 180 క్వశ్చన్స్ కలిగి ఉంటాయి. వీటి మొత్తానికి మార్కులు 720. ఇందులో ఫిజిక్స్ పేపర్‌కు సంబంధించి 45 ప్రశ్నలకు 180 మార్కులు కెమిస్ట్రీకి మొత్తం 45 క్వశ్చన్‌కు 180 మార్కులు బయోలజీకి పేపర్ 90 ప్రశ్నలకు 360 మార్కులు.
ఎగ్జామ్ పూర్తయిపోయిన తర్వాత అభ్యర్థులు పరీక్ష బుక్‌లెట్‌ను తమతోపాటు ఇంటికి తీసుకెళ్లొచ్చని ఎన్టీఏ వెల్లడించింది. నీట్ రీఎగ్జామ్ మార్కింగ్ ఇలా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ రీ ఎగ్జామ్ మార్కింగ్ విధానాన్ని కూడా విడుదల చేసింది.
ఇస్తారు. ఒక్క జవాబు తప్పు అయితే, -1 మార్కు, అలాగే వదిలేసిన జవాబులకు ఎలాంటి మార్కులు ఇవ్వరు.
నీట్ రీఎగ్జామ్ గైడ్‌లైన్స్.. ఎన్టీఏ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 11 గంటలకే చేరుకోవాలి. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత కేంద్రంలోకి అనుమతించరు. మధ్యాహ్నం 1:45 గంటల నుంచి టెస్ట్ బుక్లెట్స్ అందజేస్తారు. సరైన అడ్మిట్ కార్డు లేని అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్ కేంద్రంలోకి అనుమతించు. అంతేకాదు ఎలాంటి నిషేధిత వస్తువలను తీసుకురాకూడదు.
ఈ ధ్రువపత్రాలు తప్పనిసరి.. నీట్ రీఎగ్జామ్ రాసే అభ్యర్థులు తమతోపాటు పరీక్షా కేంద్రానికి రీనీట్ అడ్మిట్ కార్డు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి తీసుకువెళ్లాలి. రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు. ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఒక ధ్రువపత్రం. ఒకవేళ దివ్యాంగుల అయితే, సంబంధిత సర్టిఫికేట్ కూడా తీసుకు వెళ్లాలి. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో ఏవైనా అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ హెచ్చరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఇందులో అభ్యర్థులకు ప్రతి ఒక్క సరైన జవాబుకు 4 మార్కులు