
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Pakistan Submarine In Bay Of Bengal: తాజాగా పాకిస్థాన్ నౌక దళానికి చెందిన కమాండర్ ఉమర్ ఫరూక్ కి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయం అయ్యాయి. చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేస్తున్న కొత్త హంగోర్ శ్రేణి జలంతర్గాములతో తమ సైనిక శక్తి కేవలం అరేబియా సముద్రానికి పరిమితం కాదని, బంగాళాఖాతం లో వీటిని మోహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
చైనా అండతో పాక్ వ్యూహాలు.. పాకిస్తాన్ ప్రస్తుతం తమ నౌక దళాన్ని ఆధునికరించే పనిలో పడింది. ఇందులో భాగంగా చైనా నుంచి 8 హాంగోర్ శ్రేణి సబ్మెరైన్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిర్చుకుంది. ఇప్పటికీ అందులో మొదటిది పాకిస్తాన్ చేతికి వచ్చింది.
హంగూర్ శ్రేణి ప్రత్యేకత.. ఇవి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపొషన్ (AIP) సాంకేతికతతో పనిచేస్తాయి. సాధారణంగా డీజిల్-ఎలక్ట్రికల్ సబ్ మెరైన్ల కంటే ఇవి చాలా ఎక్కువ రోజులు నీటి అడుగున దాగుండగలవు. అందుకే వీటిని గుర్తించడం శత్రు దేశాలకు చాలా కష్టంగా మారుతుంది.
భారత్ కి ఎందుకు చికాకు? భారతదేశానికి బంగాళాఖాతం ఎంతో వ్యూహాత్మకమైన ప్రాంతం. 12 నాటికలు మేళ్ల ప్రాదేశికత జలాలు దాటితే అది అంతర్జాతీయ సముద్ర ప్రాంతం అవుతుంది. అయితే పాక్ మోహారింపులు భారత్‌కు కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
భారత తూర్పు నావెల్ కమాండ్ విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. మన అను జలంథర్ గాముల తయారీతో పాటు కీలకమైన ఐఎన్ఎస్ వర్షా బేస్ కూడా ఇక్కడే ఉంది. బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాలతో భారత్‌కు ఉన్న
కీలక సముద్ర వాణిజ్య మార్గాలు కూడా దీనిగుండే సాగుతాయి.
వాస్తవానికి భారత నావికా దళం ముందు పాక్ నేవి చాలా బలహీనమైనది. మన దగ్గర విమాన వాహక నౌకలు ఉన్నాయి. పాక్ మాత్రం చైనా, టర్కీ మీద ఆధారపడుతుంది. కాబట్టి పాత సబ్ మెరైన్లు ఇక్కడికి వచ్చిన యుద్ధ గమనాన్ని మార్చలేవు. కానీ, నిరంతరం నిఘా పెట్టాల్సి రావడం భారత్‌కు చికాకు కలిగించే విషయమే!
బంగ్లాదేశ్ తో మారుతున్న సమీకరణాలు.. 2024లో బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, అక్కడ మారిన రాజకీయ పరిస్థితులను పాక్ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. 1971 తర్వాత తొలిసారిగా బంగ్లాదేశ్-పాక్ మధ్య నేరుగా సముద్ర వాణిజ్యం మొదలైంది. గత నవంబర్ లో పాక్ యుద్ధ నౌక పీఎన్ఎస్ సైఫ్ బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ తీరంలో నాలుగు రోజులు పాటు నిలిచి ఉండటం గమనార్హం. ఈ మిత్ర తోనే పాక్ కు బంగాళాఖాతంలోకి రావడానికి మరింత ధైర్యం ఇస్తుంది.
1971 ఫ్లాష్ బ్యాక్.. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్ కు చెందిన పాత 'పీఎన్ఎస్ హంగోర్' సబ్ మెరైన్ను భారత యుద్ధ నౌక 'ఐఎన్ఎస్ ఖుంక్రీ' ముంచేసింది. అయితే భారత తక్షణమే స్పందించిన పాక్ గర్వకారణంగా భావించిన 'పీఎన్ఎస్ ఘాజీ' జలంతర్గామిని విశాఖ తీరంలోనే జల సమాధి చేసింది. ఈ దెబ్బతో కేవలం 13 రోజుల్లోనే పార్కు మోకాళ్లు పై కూర్చుంది. యుద్ధం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పాక్ సబ్మెర్లను బంగాళాఖాతం వైపు చూస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.