
ఇంటర్నెట్‌డెస్క్: రష్యా (Russia)పై ఉక్రెయిన్ వందల డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల కారణంగా మాస్కోలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలు మూతపడ్డాయి. దీంతో విమానాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. మాస్కో, దాని పరిసర ప్రాంతాలే లక్ష్యంగా ఉక్రెయిన్ (Ukraine) వందల డ్రోన్లతో దాడి చేసింది.
ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. రాజధాని అంతటా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. మాస్కో ఆయిల్ రిఫైనరీకి సమీపంలోనూ ఈ దాడులు జరగడంతో అక్కడ పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా పొగ కూడా వ్యాపించింది.
దీంతో ఇక్కడి రోడ్లపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. జోకోవ్స్కీ జిల్లాలోని ఓ అపార్ట్మెంట్ భవనాన్ని, మాస్కో శివార్లలోని ఓ షాపింగ్ మాల్ వద్ద డ్రోన్ దాడులు జరిగాయి. అయితే, ఈ దాడుల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అనే విషయం ఇంకా తెలియరాలేదు.
దాడులు జరుగుతున్న సమయంలో మాస్కోలోని అత్యంత రద్దీగా ఉండే షెరెమెట్యేవో విమానాశ్రయంలోని ప్రయాణికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతోపాటు విమాన కార్యకలాపాలను కూడా పరిమితం చేశారు. ఉక్రెయిన్ నుంచి తమ దేశం పైకి దూసుకొచ్చిన 500కు పైగా డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు తిప్పికొట్టాయని రష్యా రక్షణశాఖ తెలిపింది.
ఇందులో మాస్కో వైపు దూసుకొచ్చిన 180కి పైగా డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించింది. గత రెండేళ్లలో మాస్కోపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఆ దేశ మీడియా తెలిపింది. కజన్ నగరంలో ఆసియన్ నేషనల్ సమ్మిట్ (ASEAN) జరగడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం.
ఈ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఆసియన్ దేశాల నాయకులు పాల్గోనున్నారు. ఇక, ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్స్‌లో పోస్టు చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో