
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి కీలక విషయాలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఐపీఎల్ 2027 సీజన్‌ను మార్చి 10 నుంచి మే 15 వరకు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మ్యాచుల సంఖ్య పెంపు విషయంలో ప్రస్తుతం ఎలాంటి చర్చ జరగలేదని పేర్కొన్నారు.
తాజా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రత వల్ల ఐపీఎల్ 20వ సీజన్‌ను ఇంకాస్త ముందుగా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి మొదలై మే 31న ముగిసింది. మే 15 తర్వాత టోర్నీ కీలక దశకు చేరుకుంది.
ఇలాంటప్పుడు పలుచోట్ల వర్షాలు పడే అవకాశమూ ఉంది. ఇక ఎండల తీవ్రత కూడా కొన్ని ప్రాంతాల్లో ఆందోళన కలిగించే అంశమే. ఇటు ప్లేయర్లతోపాటు అటు ప్రేక్షకులూ ఆటను ఆస్వాదించేందుకు ఇబ్బంది అవుతుంది. ఈక్రమంలో ఐపీఎల్ గవర్నింగ్ బాడీతో బీసీసీఐ చర్చలు జరుపుతోంది.
లీగ్‌ను ఇంకాస్త ముందుగానే ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాం. వచ్చే సీజన్ కోసం మార్చి 10 నుంచి మే 15 వరకు విండోను ఉంచాం. ప్లేఆఫ్స్, ఫైనల్‌కు వాతావరణం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేదే మా ఉద్దేశం. ఎండల తీవ్రత గురించి మాకు అభిమానుల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి.
ఇటు ఆటగాళ్లూ ఇబ్బందులు పడ్డారు. కాబట్టి వారందరికీ మంచి వాతావరణం అందించాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని సైకియా తెలిపారు. ‘‘ఇప్పటికిప్పుడు మ్యాచుల సంఖ్య పెంపు విషయంలో నిర్ణయం తీసుకోలేం. చాలా అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. వివిధ దేశాల నుంచి ఆటగాళ్లు వస్తారు.
దీనికోసం దాదాపు రెండు నెలల పాటు షెడ్యూల్‌ను కేటాయించాల్సి ఉంటుంది. కొందరు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం కష్టమవుతోంది. ఇతర దేశాలకూ ద్వైపాక్షిక సిరీస్‌లూ ఉంటాయి. ఇప్పటికైతే మ్యాచుల సంఖ్యను 74 నుంచి 94కు పెంచడంపై చర్చ జరగలేదు.
ఇప్పుడే చెప్పలేం. ఇప్పటికైతే అది సాధ్యపడే అవకాశాలు చాలా తక్కువే’’ అని దేవజిత్ సైకియా వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో