
మన చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవడం అంత సులభమైన విషయమేమి కాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, వ్యాపార భాగస్వాములు ఇలా ఎవరైనా సరే.. వారి ఆలోచనలు, భావాలు, ప్రవర్తనను మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే సంబంధాలు మరింత బలపడతాయి.
సైకాలజీ నిపుణుల ప్రకారం, ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి కొన్ని సులభమైన సైకాలజీ ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. సాధారణంగా చాలామంది మాట్లాడే వ్యక్తిని మాత్రమే పరిశీలిస్తారు. కానీ సైకాలజిస్టులు వినే వ్యక్తి ప్రవర్తనను కూడా గమనిస్తారు.
ఒక వ్యక్తి మీ మాటలను శ్రద్ధగా వింటూ కళ్లలోకి చూస్తుంటే, తల ఊపుతూ స్పందిస్తుంటే, అతనికి మీ పట్ల గౌరవం, ఆసక్తి ఉన్నట్లు. అదే ఫోన్ చూడటం, చుట్టూ గమనించడం లేదా తరచూ దృష్టి మళ్లించడం చేస్తే, అతను మీ మాటలపై పూర్తి దృష్టి పెట్టడం లేదని అర్థం చేసుకోవచ్చు.
మనం చెప్పే మాటల కంటే బాడీ లాంగ్వేజ్ చాలా సందర్భాల్లో నిజమైన భావాలను బయటపెడుతుంది. ఒక వ్యక్తి చేతులను మడిచి మాట్లాడితే అతను పూర్తిగా ఓపెన్‌గా లేడని భావించవచ్చు. అదే నార్మల్ గా కూర్చొని, బాడీని ఫ్రీగా వదిలేసి మాట్లాడితే అతను సౌకర్యంగా ఉన్నాడని అర్థం.
సైకాలజీ పరిశోధనల ప్రకారం భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో బాడీ లాంగ్వేజ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి తరచూ ఇతరులను విమర్శిస్తూ, నెగెటివ్‌గా మాట్లాడితే, అదే ఆలోచనా విధానం అతనిలో బలంగా ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు, ఇతరుల మంచి లక్షణాలను గుర్తించి ప్రశంసించే వారు సాధారణంగా సానుకూల దృక్పథం కలిగి ఉంటారు.
సైకాలజీ ప్రకారం, మనం ఇతరుల గురించి మాట్లాడే తీరు మన సొంత వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కరూ పెద్ద విషయాల్లో మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ చిన్న చిన్న అసౌకర్యాలు, ఆలస్యాలు లేదా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వారి అసలు స్వభావం బయటపడుతుంది.
లేదా చిన్న తప్పు జరిగినప్పుడు వారు ఎలా స్పందిస్తున్నారో గమనించాలి. సహనంగా వ్యవహరించే వారు భావోద్వేగ నియంత్రణ కలిగి ఉంటారు. కోపంగా లేదా అతిగా స్పందించే వారు ఒత్తిడిని సరిగా నిర్వహించలేకపోవచ్చు.
ఒక వ్యక్తి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడంటే అతనికి నేర్చుకోవాలనే ఆసక్తి, ఎదుటివారి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నట్లు. అలాగే ఎప్పుడూ తన గురించి మాత్రమే మాట్లాడే వారు తమ ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతూ ఎదుటివారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించే వారు సాధారణంగా మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉంటారు. సైకాలజీ నిపుణుల ప్రకారం ప్రశ్నలు అడిగే తీరు కూడా వ్యక్తి మానసిక ధోరణిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు, పని ఆలస్యమైనప్పుడు