
జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోతుల కొట్లాట ఓ మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. మిద్దెపై కోతులు కొట్లాడుకుంటూ కింద ఉన్న మహిళ తలపై సిమెంట్ ఇటుక పడేశాయి. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇంటర్నెట్ డెస్క్: జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
కోతుల కొట్లాట ఓ మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. మిద్దెపై కోతులు కొట్లాడుకుంటూ కింద ఉన్న మహిళ తలపై సిమెంట్ ఇటుక పడేశాయి. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ధర్మపురిలోని కమలాపూర్ రోడ్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన కొనపర్తి సత్యనారాయణ, పద్మ భార్యాభర్తలు. బుధవారం సాయంత్రం పద్మ ఇంటి ముందు కూర్చుని మరో మహిళతో మాట్లాడుతోంది. అదే సమయంలో ఇంటి రేకులపై కోతులు తీవ్రంగా గొడవపడసాగాయి. ఈ నేపథ్యంలోనే రేకులు గాలికి ఎగిరిపోకుండా ఉండటానికి బరువు కోసం పెట్టిన సిమెంట్ ఇటుకను కిందకు పడేశాయి.
ఆ ఇటుక నేరుగా పద్మ తలపై పడింది. తలకు తీవ్ర గాయం అవ్వటంతో పద్మ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి గాయత్రి మృతి కేసు.. అల్లుడిపైనే తల్లి అనుమానాలు కూటమి ప్రభుత్వ పురోగతిని తట్టుకోలేకే..
జగన్ డ్రామాలు: డూండీ రాకేశ్