
అమెరికా, ఇరాన్ల చారిత్రాత్మక శాంతి ఒప్పందం. మూడు నెలల యుద్ధానికి ముగింపు. ఉల్లంఘిస్తే బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరిక. Peace Agreement: దీర్ఘకాలిక శత్రుత్వానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి ఒప్పందం(Peace Agreement)పై సంతకాలు చేశాయి.
బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ డిజిటల్ పద్ధతిలో ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడంతో, గురువారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. గత మూడు నెలలుగా సాగుతున్న భీకర యుద్ధానికి ఈ ఒప్పందంతో తెరపడింది.
అంతేకాకుండా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి అతి త్వరలోనే తిరిగి తెరుచుకోనుంది. Fuel Prices: పెట్రోల్ ధరలు తగ్గించం.. కేంద్ర ప్రభుత్వంపై 12,000 కోట్ల భారం.. కేంద్ర మంత్రి సురేష్ గోపి కీలక వ్యాఖ్యలు జీ7 సదస్సు కోసం ఫ్రాన్స్ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వర్సైల్లెస్ ప్యాలెస్ వేదికగా ఈ ఒప్పందంపై సంతకం చేసినట్లు స్వయంగా ధృవీకరించారు.
మరోవైపు, ఇరు దేశాల అధ్యక్షుల ఆమోదంతో 'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' పూర్తయిందని, ఇప్పుడు దీని అమలును పరీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘేయ్ పేర్కొన్నారు. అయితే, ఈ శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ తన శైలిలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఈ అవగాహన ఒప్పందం ఎంతమాత్రం తుది నిర్ణయం కాదని స్పష్టం చేశారు. గత 47 ఏళ్లుగా ఇరాన్ మోసపూరిత వైఖరినే అవలంబిస్తోందని ఆరోపించిన ట్రంప్, ఒకవేళ ఇరాన్ ఈ ఒప్పంద నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే లేదా తనకు నచ్చని విధంగా వ్యవహరిస్తే.. ఆ దేశంపై మళ్లీ బాంబుల వర్షం కురిపించడానికి వెనకాడబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు
.