
Sr NTR Venkatesh Multi starrer: తెలుగు హీరోల్లో ఎక్కువ మల్టీస్టారర్ మూవీస్ చేసిన హీరోల్లో సీనియర్ హీరో వెంకటేష్ ముందు వరుసలో ఉన్నారు. యంగ్ హీరోల నుంచి చిరంజీవి వరకు అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌తో తొలిసారి మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో వెంకటేష్ గతంలో సీనియర్ ఎన్టీఆర్‌తో ఓ మల్టీస్టారరర్ మూవీ చేయాలనుకున్నాడు. తీరా పట్టాలెక్కక ముందే ఈ సినిమా ఆగిపోయింది. Venkatesh NTR Movie Multi Starrer Cancelled: ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకా.. బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ కవిసార్వభౌముడు వంటి చిత్రాలు చేశారు.
వీటితో పాటు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ స్టోరీతో ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఇందులో ఓ పాత్ర కోసం వెంకటేష్‌ను సెలెక్ట్ చేశాడు. ఎన్టీఆర్ తన సినీ జీవితంలో ఎన్నో చారిత్రక పాత్రలను పోషించారు. కానీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా చేయాలనుకున్నారు.
కానీ చేయలేకపోయారు. బాలకృష్ణ కంటే ముందుగా ఎన్టీఆర్ ఈ క్యారెక్టర్ కోసం ఓ కథ రాసుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ పాత్రలో నటించాలనుకున్నారు. ఆయన కుమారుడు ‘పులమావి’ క్యారెక్టర్ కోసం వెంకటేష్ అనుకున్నారు. వెంకీ కూడా ఎన్టీఆర్‌తో సినిమా కోసం రెడీ అయ్యారు.
తీరా సెట్స్ పైకి వెళ్లకముందే అనుకోని కారణాలు.. ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత చాలా యేళ్లకు క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ఈ సినిమా చేయడం విశేషం. ఈ చిత్రం బాలయ్యకు వందో సినిమా. ఇక ఎన్టీఆర్‌తో నాటించాలనుకున్న వెంకటేష్ కల కల్లగానే మిగిలిపోయింది.
కానీ ‘కలిసుందాం.. రా’ సినిమాలో నచ్చావే పాలపిట్ట సాంగ్‌లో ఎన్టీఆర్ గ్రాఫిక్స్ రూపంలో కాసేపు కనిపించారు. ఈ రకంగా ఎన్టీఆర్‌తో నటించాలనే కోరిక తీర్చుకున్నాడు వెంకటేష్. వెంకటేష్ విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా చేస్తున్నాడు
. ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మరోవైపు ఈ రోజు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ తో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.