
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలోని నెల్లుట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఎస్సై బండి శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
దేవరుప్పుల మండలానికి చెందిన జాట్ రోహిత్ (22) హైదరాబాద్ నుంచి బొలెరో వాహనంలో సామాన్లు తీసుకుని వస్తుండగా నెల్లుట్ల ఫ్లైఓవర్ సమీపంలో టైర్ పంక్చర్ అయింది. దీంతో గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామానికి చెందిన తన డ్రైవర్‌ను జాకీ తీసుకుని రావాలని రోహిత్ చెప్పాడు.
ఈ క్రమంలో దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన దొనికెన్ని రాజేందర్ (27) తన లారీలో హనుమకొండ వైపు వెళ్తూ వీరిని గమనించి సాయం చేసేందుకు రోడ్డుపక్కన వాహనాన్ని ఆపాడు. ముగ్గురూ కలిసి బొలెరో వాహనం వద్ద ఉండగా, హనుమకొండ వైపు నుంచి అతివేగంగా వచ్చిన మరో లారీ వెనుక నుంచి బొలెరోను ఢీకొట్టింది.
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. మాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
.