భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అరిటాకు భోజనం చాలా పాపులర్. అరిటాకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఈ ఆకుల్లో భోజనం మరింత రుచిని, సువాసనను ఇస్తుంది.
కానీ ఈ ఆకులే కాకుండా మరికొన్ని ఆకులను కూడా భోజనం తినేందుకు ఉపయోగించవచ్చు. అవేంటో చూద్దాం.
మోదుగ ఆకులకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే పురాతన కాలం నుంచి ఇందులో భోజనం తినే అలవాటు ఉంది. ఈ ఆకులతో తయారుచేసే విస్తార్లకు ఎంతో డిమాండ్ ఉంటుంది.
పనస ఆకులతో విస్తార్లు తయారు చేస్తారు. ఈ ఆకుల్లోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే భోజనానికి ఈ ఆకులు వాడొచ్చు.
టేకు ఆకులు పెద్దవిగా, దృఢంగా ఉంటాయి. ఈ ఆకుల్లోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. అందుకే ఈ ఆకుల్లో భోజనం తింటే హెల్త్‌కు చాలా మంచిదని చెబుతారు.
తామర ఆకులకు సూక్ష్మక్రిములను తిప్పికొట్టే ప్రత్యేకమైన గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఈ ఆకుల్లో భోజనం తినడం చాలా మంచిది. అలాగే ఆహారం ప్యాక్ చేయడానికి కూడా ఈ తామర ఆకులను వాడతారు. దీనివల్ల భోజనానికి మంచి రుచి, సువాసన వస్తాయి.
పసుపు ఆకుల్లో భోజనం చేయడం చాలా కాలంగా సంప్రదాయంగా వస్తోంది. ఈ ఆకుల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆహారాన్ని పాడవుకుండా కాపాడుతాయి. అలాగే భోజనం రుచిగా ఉంటుంది.
కొబ్బరి ఆకుల్లో భోజనం చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ ఈ ఆకుల్లో ఆహార పదార్థాలను ప్యాక్ చేయడం ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ఆహారానికి ప్రత్యేకమైన రుచి, వాసన లభిస్తాయి.
అత్తి పండు (అంజీరా) ఆకులను కూడా భోజనానికి వాడతారు. వీటిలోని విటమిన్లు, ఐరన్, పొటాషియం వంటివి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకుల్లో భోజనం వండుతారు కూడా.
భారతీయ సంప్రదాయంలో భోజనం లేదా పాన్ తినడం కోసం తమలాపాకును విరివిగా వాడతారు. తమలాపాకులను విస్తారుగా కుట్టి భోజనం చేస్తే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. హెల్త్‌కు చాలా మంచిది.